»   »  ఫ్లాప్ హీరోకే హిట్టిస్తే..మరి మాకైతే...

ఫ్లాప్ హీరోకే హిట్టిస్తే..మరి మాకైతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస ఫ్లాఫులతో దూసుకుపోతున్న హీరోకు హిట్ ఇవ్వటం అంటే మాటలు కాదు. ఆ పని ...దర్శకుడు కిషోర్ తిరుమల చేసారు. అందుకే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీ అయ్యిపోయారు. ఓ రేంజిలో డిమాండ్ ఏర్పడింది. సక్సెస్ లో ఉన్న హీరోలు అతన్ని తమ సినిమాలు చేయటానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఫ్లాప్ ల్లో ఉన్న హీరోకే హిట్ ఇస్తే మాకు బ్లాక్ బస్టర్స్ ఇస్తాడని వారు నమ్ముతున్నారు.

హీరో రామ్ ...నేను శైలజ చిత్రానికి ముందు వరసపెట్టి ఫ్లాపులలో ఉన్నారు. ఏ సినిమా చేసినా బాంబులా పేలిపోయింది. పండుగ చేస్తో ఓకే అనిపించుకున్నా ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఏ కథ చేసి ఒప్పించాలి అనే డైలమోలో ఉన్న రామ్ కు కిషోర్ తిరుమల ఓ కొత్త తరహా కథ,కథనం తో వచ్చి ఒప్పించారు.

 Nenu..Shailaja director in full demand

లిమిటెడ్ బడ్జెట్ తో చేసిన ఈ చిత్రం రామ్ కు హిట్ ఇచ్చింది. అతన్ని పడిపోకుండా నిలబెట్టింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిఉంటే పరిస్ధితి వేరేగా ఉండేది. ఇలా ఫ్లాఫ్ ల్లో ఉన్న రామ్ కు హిట్ ఇవ్వటంతో దర్శకుడుగా కిషోర్ తిరుమలకు ఇండస్ట్రీలో పూర్తి స్ధాయి డిమాండ్ వచ్చింది. పెద్ద బ్యానర్స్ ,హీరోలు సైతం అతనితో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు కిషోర్ తిరుమల రెమ్యునేషన్ కోటిన్నర అని తెలుస్తోంది. ఇంతకు ముందు తమిళంలో ఒకటి, తెలుగులో సెకండ్ హ్యాండ్ అనే చిత్రాలు చేసినా అతనికి ఆశించిన పేరు రాలేదు. రఘువరన్ బిటెక్ చిత్రానికి తెలుగు డైలాగులు రాయటానికి వచ్చిన కిషోర్ కు ..ఇదే బ్యానర్ లో అతని డైలాగులు నచ్చి సినిమా ఇచ్చిన రామ్ ..తన తదుపరి చిత్రాన్ని సైతం అతనితో చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

English summary
Director Kishore Tirumala who gave hit with Nenu..Shailaja to Ram has turned as hot pick for producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X