ధనుష్ కోసం మరోసారి ఆ పాపను లాగుతున్న శేఖర్ కమ్ముల.. సెట్టయితే మామూలుగా ఉండదేమో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా శేఖర్ కమ్ముల తన రేంజ్ ను పెంచుకునేందుకు నేషనల్ లెవెల్లో సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు పాన్ ఇండియాకు దగ్గరలోనే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక బిగ్ బడ్జెట్ సినిమాలో మరోసారి సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పర్ఫెక్ట్ కాంబో

పర్ఫెక్ట్ కాంబో

ధనుష్ తో సినిమా సెట్టయ్యింది అనగానే ఒక్కసారిగా ఆ వార్త మీడియాలో వైరల్ అయ్యింది. నిజంగా ఇలాంటి కాంబినేషన్ ను ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పవచ్చు. ప్రతి సినిమాతో ప్రయోగాలు చేసే ధనుష్ ఈసారి శేఖర్ కమ్ములతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.

లీడర్ లాంటి పెద్ద ప్రయోగం

లీడర్ లాంటి పెద్ద ప్రయోగం

అయితే సినిమాలో స్టార్ క్యాస్ట్ ఎలా ఉండబోతొందనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్ విషయంలో అయితే నిర్మాతలు పెద్దగా కాంప్రమైజ్ అవ్వరని అందరికి తెలిసిందే. అయినా కూడా శేఖర్ కమ్ముల అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి డబ్బు వృధా చేయడు. ఇక ఇప్పుడు మూడు భాషల్లో వచ్చే సినిమా కాబట్టి ఒక నార్మల్ లవ్ స్టొరీతో రాడని చెప్పవచ్చు. తప్పకుండా లీడర్ లాంటి పెద్ద ప్రయోగం ఎదో చేస్తాడని టాక్ వస్తోంది.

మరోసారి సాయి పల్లవి

మరోసారి సాయి పల్లవి

ఇక సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక రిస్క్ లేకుండా దర్శకుడు మరోసారి సాయి పల్లవిని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదివరకే ఫిదా సినిమాతో హిట్టు కొట్టిన ఈ కాంబినేషన్ లవ్ స్టోరి సినిమాతో కూడా అదే తరహాలో హిట్టు కొట్టడానికి సిద్ధమయ్యారు.

Recommended Video

Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
సెట్టయితే మామూలుగా ఉండదు

సెట్టయితే మామూలుగా ఉండదు

ఇక ధనుష్ తో చేయబోయే సినిమాలో కూడా సాయి పల్లవిని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం భారీగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధనుష్ - సాయి పల్లవి రౌడి బేబి సాంగ్ తో వరల్డ్ వైడ్ గా క్రేజ్ అందుకున్నారు. ఇక సెట్టయితే శేఖర్ కమ్ముల వారిని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X