అక్కినేని మల్టీస్టారర్ వెనకున్న అసలు మ్యాటర్ ఇదన్నమాట!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సెలబ్రెటీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకవైపు నాగార్జున బిగ్ బాస్ షోతో ప్రతి వారం హైప్ క్రియేట్ చేస్తుండగా మరోవైపు సమంత కూడా సామ్ జామ్ అంటూ ఓటీటీ వరల్డ్ లో మరింత వైరల్ అవుతోంది. ఇక లవ్ స్టొరీ సినిమాకు సంబంధించిన న్యూస్ లతో నాగ చైతన్య పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా అఖిల్ బిగ్ బాస్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ లో అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం గ్యాప్ లేకుండా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల నాగార్జున ఒక సినిమా కోసం మనం దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అఖిల్, నాగార్జున ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేవలం అది మల్టీస్టారర్ కాదట. ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సినిమాలో కనిపించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.

New rumours viral on akkineni family another multi starrer

మనం సినిమాతో అక్కినేనికి మరచిపోలేని హిట్టిచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగ చైతన్యతో థాంక్యూ అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే నాగార్జున విక్రమ్ కు ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఫ్యామిలీ కోసం ఒక మంచి కథను రెడీ చేయాలని కోరాడట. సొంత ప్రొడక్షన్ లోనే పెద్దగా బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్ ఫ్యామిలీ స్టోరీ అయితే చాలని చెప్పాడట. అందుకు విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కథ సెట్ చేయడానికి సమయం ఎంతైనా పట్టవచ్చని దర్శకుడు ముందే క్లారిటీ ఇచ్చినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X