twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదే నిజమైతే.. ఆ ఇంగ్లీష్ చానెల్ పరువు గంగపాలే..

    బాహుబలి2పై ప్రపంచ మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తుంటే అంతర్జాతీయ సంస్థకు చెందిన జాతీయ ఛానెల్ మాత్రం మిడిమిడి అజ్క్షానంతో అభాసుపాలైంది.

    By Rajababu
    |

    బాహుబలి2పై ప్రపంచ మీడియా అంతా రచ్చ రచ్చ చేస్తుంటే అంతర్జాతీయ సంస్థ కు చెందిన జాతీయ ఛానెల్ మాత్రం మిడిమిడి అజ్క్షానంతో అభాసుపాలైనట్టు స్పష్టమవుతున్నది. బాహుబలి సినిమా ఒరిజినల్‌గా తమిళంలో రూపొందిందంటూ లైవ్‌లో జరిగినట్టు కనిపించే ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి ఏ భాషలో తీశారో అనే కనీస విషయ పరిజ్క్షానం లేకుండా చర్చ జరిపారంటూ చర్చ జరుగుతున్నది. ఆ చానెల్‌పై నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. అయితే అది వాస్తవమా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఫోటో షాప్‌లో మార్ఫింగ్ చేసి పెట్టారా? అనే సందేహం వ్యక్తమవుతున్నది.

    టీఆర్పీ కోసం..

    టీఆర్పీ కోసం..

    బాహుబలి2 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ చర్చ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించినట్టు ఆ ఫోటోలో స్పష్టమైంది. నలుగురు మీడియా నిపుణులు చర్చలో ఉన్నారు. బాహుబలి (2017) అంటూ టైటిల్ పెట్టి ఈ చిత్రాన్ని ఒరిజినల్‌గా తమిళంలో రూపొందించారు. ఆ తర్వాత దానిని హిందీ, తెలుగు, కన్నడ భాషలోకి డబ్ చేశారు అని రాశారు. ఆ టీవీ ప్రసారం చేసిన విజ్వుల్స్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చరచ్చ చేశారు.

    వాస్తవాలు, విషయంపై అవగాహన...

    వాస్తవాలు, విషయంపై అవగాహన...

    చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కనీస విషయాలు తెలుసుకోకపోవడం సరికాదు అని పలువరు నెటిజన్లు మండిపడ్డారు. ఇటీవల కాలంలో మీడియా సరైన పరిశోధన చేయకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదనే వాదనకు ఈ కార్యక్రమం మరింత బలం చేకూర్చింది. హంగామా చేయడానికి చేసే ప్రయత్నాల్లో హడావిడిగా టెలివిజన్ ఛానెల్ పప్పులో కాలేస్తుంటాయి.
    అందులో భాగమే ఈ పొరపాటు జరిగిందా అని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    ఏకకాలంలో పలు భాషల్లో..

    ఏకకాలంలో పలు భాషల్లో..

    సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి2 చిత్రం ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందింది. తొలుత తెలుగు చిత్రంగా ప్రారంభమైంది. ఆ తర్వాత వస్తున్న స్పందన చూసి ఏకకాలంలో తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోకి విడుదల చేయాలని నిర్ణయించారు.

    విశేష ఆదరణ..

    విశేష ఆదరణ..

    శుక్రవారం విడుదలైన బాహుబలి2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నది. దేశ విదేశాలలో రికార్డులను తిరుగరాస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అందిన ప్రాథమిక వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులు బ్రేక్ అయినట్టు సమాచారం.

    English summary
    A national Television media channel's misinterpretation of Baahubali goes viral in social media. The Television channel quoted that Baahubali originally picturised in Tamil language. And then dubbed into Hindi, Telugu, Kannada, Malayalam. On this issue netizens, Prabhas fans trolled in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X