»   » కొణిదెల నిహారిక తొలి సినిమా రెమ్యూనరేషన్?

కొణిదెల నిహారిక తొలి సినిమా రెమ్యూనరేషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురైన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి నిహారిక రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం.

Niharika get 40 Lakhs Remuneration for Debut Film

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది.

ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక ముందే ఆమెకు హీరోయిన్ గా మరో ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. అవార్డు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆమె సినిమా అంగీకరించినట్లు సమాచారం.అయోధ్య కుమార్ మిణుగురులు చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి కాన్సెప్టుతో కూడిన కథ చెప్పడంతో నాగబాబు ఓకే చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే....ఈ చిత్రం తెలుగు-తమిళంలో తెరకెక్కబోతోందట.

English summary
Mega Heroine Niharika creating Records with her Debut Movie, As per the sources an Whooping amount of 40 Lakhs was given as Remuneration to Niharika for her debut movie with Hero Naga Shourya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu