»   »  ఫ్లాఫ్ ల డైరక్టర్ తో ....హిట్ నిఖిల్ నెక్ట్స్ ?

ఫ్లాఫ్ ల డైరక్టర్ తో ....హిట్ నిఖిల్ నెక్ట్స్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా సందీప్ కిషన్ తో టైగర్, అంతకు ముందు కృష్ణ మాధవ్ తో హృదయం ఎక్కడుంది అనే చిత్రం, 2014లో అప్పుచ్చి గ్రామం ఇలా వరస డిజాస్టర్ చిత్రాలు అందించిన దర్శకుడు వి.ఐ ఆనంద్. ఆయన తాజాగా తెలుగులో నిఖిల్ హీరోగా మరో చిత్రం ఓకే చేయించుకున్నట్లు సమాచారం. థ్రిల్లింగ్ లవ్ స్టోరి ఒకటి నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిఖిల్ తాజా చిత్రం ‘శంకరాభరణం' విషయానికి వస్తే...

కోన వెంకట్ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్. ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.

Nikhil okays his next with Tiger director?

నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.

కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ -''ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.

English summary
Nikhil okayed a “thrilling love story” narrated by VI Anand, the young director who made his debut with Sundeep Kishan’s Tiger
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu