»   » బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్...నిఖిల్ సినిమాలో

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్...నిఖిల్ సినిమాలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తెలుగు సినిమాలో కనిపించనున్నారా. అవుననే వినపడుతోంది. నిఖిల్ హీరోగా చేస్తున్న శంకరాభరణం చిత్రంలో ఆయన్ను కొద్ది సేపు చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన్ను కన్వీన్స్ చేయాలని ఆలోచనతో ఆయన్ను కలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక దేశ వ్యాప్తంగా లాలూ ప్రసాద్ యాదవ్ ని తెలియని వారు లేరు. దాంతో ఖచ్చితంగా ఆయన కనపడటం హైలెట్ అవుతుంది, నేషనల్ మీడియాలో సైతం ఈ సినిమాకు పబ్లిసిటీ వచ్చే అవకాసం ఉంది. ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్.


మరో ప్రక్క ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని ఇప్పటికే విడుదల చేసారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు. ఆ పోస్టర్ ని ఇక్కడ చూడండి.ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.


Nikhil Shankarabharanam Movie :May have Lalloo on

కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.


నిర్మాత మాట్లాడుతూ -''ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.

English summary
Nikhil, Nandita, Diksha Panth's crime thriller ‘Shankarabharanam’ directed by debutante Uday Nandanavanam. Buzz is former Bhihar CM, RJD chief Laloo Prasad Yadav will be seen for few minutes in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu