»   » నితిన్ ఫాదర్ ఆవేశం? చార్మి మీద పరువు నష్టం కేసు!

నితిన్ ఫాదర్ ఆవేశం? చార్మి మీద పరువు నష్టం కేసు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్, నితిన్ సినిమా రద్దవడం..... వెంటనే పూరి జగన్నాథ్ నితిన్ ప్లేసులో వరుణ్ తేజ్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ ప్రాజెక్టులో చార్మి జోక్యం కారణంగానే పూరి-నితిన్ మూవీ రద్దయిందంటూ అంతలోనే గాసిప్స్ హల్ చల్ చేసాయి.

ఈ గాసిప్స్ విని ఆవేశ పడిన ఛార్మి.... ఆ సినిమా రద్దవడానికి కారణం నేను కాదు, ఫైనాన్షియల్ కారణాలే. నితిన్ ఆ సినిమా నర్మించాలనుకున్నాడు. కానీ ఉన్నడబ్బులన్నీ అఖిల్ సినిమా మీద పెట్టాడు. డబ్బుల్లేకనే ఈ సినిమా ఆయన చేయలేక పోయాడు అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేంది. చార్మి స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యాని గురి చేసింది. వెంటనే తాను టంగ్ స్లిప్ అయ్యాననే విషయం గమనించిన ఛార్మి.....రూమర్స్ విని పొరబడ్డాను, అలా మాట్లాడాను, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అంటూ క్షమాపణ చెప్పేసింది ఛార్మి.

Nitin's Father To Take Legal Action On Charmi Kaur?

అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగి పోయింది. ఛార్మి కామెంట్స్ నితిన్ ఫ్యామిలీని బాగానే హర్ట్ చేసినట్లు సమాచారం. చార్మి క్షమాపణలు చెప్పినా, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డిలో ఆవేశం తగ్గలేదని అంటున్నారు. ఆయన చార్మిపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి వ్యవహారాలు సినిమా పరిశ్రమలో సర్వ సాధారణమే, ఈ మాత్రం దానికి చార్మిపై కేసు వేస్తారా? అనే వారూ లేక పోలేదు. పలువురు సినీ ప్రముఖులు సుధాకర్ రెడ్డిని కూల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.

English summary
It is known that Puri Jagannadh replaced Nithin with Varun Tej in his next, because of some untold reasons. Apparently, few gossip columns made Charmi Kaur a scapegoat in the entire episode and stated that her involvement in the film made Nithin walk out of the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu