Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ మీద నమ్మకంతోనే నితిన్ 13 కోట్లు??
హైదరాబాద్ : నితిన్ కి మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. అందుకుతగినట్లుగానే వరస ఫ్లాపుల్లో ఉన్న అతనికి పవన్ ...ఇష్క్ ఆడియో కి రాగానే అది హిట్టై కెరీర్ మళ్లీ మొదలైనట్లైంది. అంతేగాక..తన తదుపరి చిత్రం గుండె జారి గల్లంతైందిలో పవన్ చిత్రంలోని పాట పెట్టగానే ఆ సినిమా కూడా సూపర్ హిట్టైంది.
ఇప్పుడు ఆ నమ్మకం నిరూపించుకోవటానికా అన్నట్లు పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేది కి నైజాం రైట్స్ తీసుకున్నాడని సమాచారం. అదీ ఓ రేంజి రేటుకు అని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఫిల్మ్ సర్కిల్సో చెప్పబడుతున్న దాన్ని బట్టి.. 13 కోట్లకు తీసుకున్నాడని చెప్తున్నారు. ఇంత రేటుకు నైజాం రైట్స్ అమ్ముడుపోవటం పెద్ద రికార్డుగా చెప్పబడుతోంది.
అయితే ఇప్పుడు..మరో ప్రక్క రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు వారం తేడాలో విడుదల అవుతోంది. ఎవడు చిత్రాన్ని నైజాం ఏరియా పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు నిర్మాత. దాంతో ఆయన తన చిత్రం టాక్ ఎలా వచ్చినా థియోటర్స్ లో మినిమం నెల రోజులు పాటు చిత్రాన్ని తీయరు. అలాంటిది ఎవడు కి పాజిటివ్ టాక్ వినపడుతోంది. దాంతో చిత్రాన్ని మంచి థియోటర్ లో నైజాం అంతటా ఉంచుతారు.
ఈ నేపధ్యంలో అత్తారింటికి దారేది చిత్రం నైజాం ఎంత మేరకు రాబడుతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఎవడు సూపర్ హిట్ టాక్ వచ్చినప్పుడు...పవన్ కళ్యాణ్ చిత్రం ఎంత పెద్ద హిట్టైనా పోటీ ఖచ్చితంగా ఉంటుంది. రెండూ షేర్ చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది. దాంతో నితిన్ ఏ మేరకు లాభపడతాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.