బాలకృష్ణ పేరు తీసేసే ఈ సారి పోస్టర్

By Srikanya

హైదరాబాద్: మొదట కాంట్రావర్శి క్రియేట్ చేసి జనాల నోళ్లలో నానటం..తర్వాత నాలుక కరచుకున్నట్లుగా ఆ కాంట్రావర్శి ఎలిమెంట్ ని తొలిగించటం మామూలైపోయింది. ఎలాగూ ఈ కాంట్రావర్శి వేడిలో జనం దృష్టిలో పడతామని, ఆ తర్వాత ఆ ఎలిమెంట్ ఉంచినా తీసేసినా రావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి నో ప్లాబ్లం అనే ప్లాన్స్ చేస్తున్నారు. తాజాగా ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణా టైటిల్ తో ఓ చిత్రం వస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు. దానికి ట్యాగ్ లైన్ గా బెస్ట్ వాచెడ్ విత్ సోడా అని పెట్టారు. ఇది బాలకృష్ణ అభిమానులకు చాలా కోపం తెప్పించింది. దాంతో ఇప్పుడు ఆ టైటిల్ లోంచి బాలకృష్ణ అనేది తీసేసి కేవలం ఇదేగా ఆశపడ్డావ్ అని ఉంచనున్నట్లు సమాచారం.

 No Balakrishna name in movie title
బాలకృష్ణకు మాన్షన్ హౌస్ అంటే ఇష్టమనే టాక్ చాలా కాలంగా మీడియాలో ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఈ పోస్టర్ క్రియేట్ చేసి కాంట్రావర్శీ క్రియేట్ చేద్దామనే నిర్మాతల ఐడియా అంటున్నారు. మాన్షన్ హౌస్ బాటిల్ ని పెట్టి లేబుల్ స్దానలో.. దీనికేగా ఆశపడ్డావ్ బాలకృష్ణ అని పెట్టి..క్రింద సోడాతో కలిపి తాగమని..అంటున్నారు. ఇక ఈ చిత్రం ఓ తమిళ డబ్బింగ్. తమిలంలో వచ్చి విజయవంతమైన Idharkuthane Aasaipattai Balakumara ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

తమిళ డబ్బింగ్ చిత్రం 'ఇదేగా ఆశపడ్డావ్‌ బాల - కృష్ణ' చిత్రం కోసం తొలిసారి పాట పాడారు. విజయ్‌ సేతుపతి, స్వాతి జంటగా నటించిన చిత్రమిది. గోకుల్‌ దర్శకుడు. ఇందులో 'నీ బెస్ట్‌ ఫ్రెండ్‌కి మహేష్‌లాంటి మొగుడు దొరక' అనే సరదా గీతాన్ని ఆలపించారు సందీప్‌. అంతేకాదు... సామ్రాట్‌తో కలసి ఈ గీత రచనలో కూడా పాలుపంచుకొన్నారు. ''ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని అల్లరిగా తిడుతూ సాగే గీతమిది. సందీప్‌ చక్కగా ఆలపించారు'' అని నిర్మాతలు సుజన్‌, సమన్యరెడ్డి చెప్పారు. సంగీతం: సిద్దార్థ్‌విపిన్‌.

విజయసేతుపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం అక్కడ మంచి విజయమే సాధించింది. క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో విజయ సేతుపతి హీరోగా చేసారు. గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలో టీజర్ ని,ఆడియో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ లోనూ ఈ పోస్టర్ మంచి క్రేజ్ నే క్రియేట్ చేసిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X