»   » ఇంకా అమ్ముడు పోలేదు: బాలయ్య ‘లయన్’ వాయిదా?

ఇంకా అమ్ముడు పోలేదు: బాలయ్య ‘లయన్’ వాయిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్' మూవీ చిత్రం విడుదల ముందే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమాను మే 1న విడుదల చేయాలని నిర్ణయించారు. డేట్ దగ్గర పడుతున్నా సినిమా ఇంకా అన్ని ఏరియాల్లో అమ్ముడు పోలేదట.

సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కి ఈ చిత్రాన్ని రూ. 20 నుండి 22 కోట్ల బడ్జెట్ రేంజిలో పూర్తి చేద్దామనుకున్నారు. కానీ సినిమా పూర్తయ్యే నాటికి బడ్జెట్ రూ. 35 కోట్లకు చేరుకుంది. దీంతో బడ్జెట్ కు తగిన విధంగా సినిమాను కూడా వివిధ ఏరియాల్లో ఎక్కువ రేటుకు అమ్మాలని నిర్ణయించారు. ధర ఎక్కువ కావడంలో పలు ఏరియాలకు సంబంధించి ఇంకా ఎవరూ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు.


No Buyers For Balakrishna's Lion?

ఈ పరిణామాల నేపథ్యంలో మే 1న విడుదల కావాల్సిన సినిమా మే 9కి వాయిదే పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏ విషయం అనేది అధికారికంగా తేలాల్సి ఉంది.


రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

English summary
Nandamuri Balakrishna's Lion seems to be facing release hiccups due to its poor pre-release business. Though the film is slated to release on May 1, the date appears to be ruled out, as the business of the film in many areas is still pending.
Please Wait while comments are loading...