For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata: వారి నుంచి నో రెస్పాన్స్.. బాధలో మహేష్ ఫ్యాన్స్

  |

  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన సందర్భంగా టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. బడా నిర్మాత అల్లు అరవింద్ లాంటివారు సినిమా అద్భుతంగా ఆడాలని సినీ పరిశ్రమ మళ్ళీ కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ సినిమా విషయంలో టాలీవుడ్ సపోర్ట్ ఉంది కానీ అది మాత్రం సరిపోవడం లేదని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వతహాగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళరు. అలాగే అందరి హీరోలతో ఆయనకు సత్సంబంధాలు ఉంటాయి.

  ఈ నేపథ్యంలోనే మిగతా హీరోల సినిమాలు బాగున్నప్పుడు మహేష్ బాబు వాటిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు వాటిని ఒక రకంగా ప్రమోట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో పాతవిషయాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య విడుదలైన అఖండ, పుష్ప లాంటి సినిమాలు కూడా అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాక భీమ్లా నాయక్ సినిమా విడుదలైనప్పుడు కూడా సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మరో భారీ బడ్జెట్ సినిమా అయిన ఆచార్య విడుదలైన సమయంలో అయితే ఏకంగా వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు కొంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎవరి నుంచి కూడా ప్రస్తుతానికి మహేష్ బాబు సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా లేదని అసలు వాళ్లు సర్కారు వారి పాట గురించి తెలియనట్లే ఉన్నారని మహేష్ బాబు అభిమానులు ఫీల్ అవుతున్నారు. స్నేహం అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి కానీ పూర్తిగా మహేష్ బాబు ఒక్కడే వారికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

  No response from tollywood biggies about sarkaru vaari paata

  అయితే ఫ్యాన్స్ లో మరికొందరు మాత్రం మహేష్ బాబు సినిమా గురించి వారు స్పందించినా స్పందించకపోయినా సినిమా అద్భుతంగా ఉందనే విషయాన్ని జనానికి వెళ్లిపోయిందని జనం సినిమాను ఆదరిస్తారు. కానీ వాళ్ళు చెబితే ఎంత చెప్పకపోతే ఎంత అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండో రోజు వసూళ్లు కూడా భారీగానే నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా శుక్రవారం కావడంతో వసూళ్ల మీద తొలుత పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు కానీ సెలవు రోజుల్లో ఎలా అయితే హౌస్ ఫుల్స్ నడుస్తాయో అదే విధంగా రెండో రోజు శుక్రవారం నాడు కూడా హౌస్ ఫుల్స్ నడిచాయని అనేక ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇంకా అధికారిక కలెక్షన్లు విడుదల కాలేదు కానీ విడుదల అయితే రెండో రోజు కూడా భారీ ఎత్తున కలెక్షన్లు సాధించిన విషయం బయటకు వస్తుందని వారు చెబుతున్నారు. ఇక సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో హైదరాబాద్లోని ఒక కాస్ట్లీ పబ్ లో సినిమా యూనిట్ అందరికీ నిర్మాతలు గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

  English summary
  Mahesh fans feeling unhappy that there is no response from Tollywood biggies about sarkaru vaari paata.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion