»   »  డైరక్టర్ బాబి పై ఎన్టీఆర్ కు ఫైర్ అయ్యాడా?...అసలేం జరిగింది

డైరక్టర్ బాబి పై ఎన్టీఆర్ కు ఫైర్ అయ్యాడా?...అసలేం జరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ వార్తలో నిజముందో తెలియదు..మీడియా సర్కిల్స్ హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం చేయటానికి కమిటైన దర్శకుడు బాబిపై ఆయన మండిపడ్డారని. ఇంకా సినిమా ప్రారంభమే కాలేదు. అప్పుడే ఈ కోప,తాపాలు ఏమిటి అంటారా. అయితే పూర్తి కథనం చదవాల్సిందే.

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఏం సినిమా చేయబోతున్నాడనే విషయం గత కొంత కాలంగా చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఎట్టకేలకు పవర్ సినిమా దర్శకుడు బాబీతో కల్యాణ్ రామ్ బ్యానర్‌పై ఎన్టీఆర్ తరువాతి సినిమా ఉంటుందని కల్యాణ్‌రామ్ స్వయంగా ప్రకటించడంతో ఆ గందరగోళానికి తెరపడింది.

NTR angry on director Bobby..!

కానీ, ఆ సినిమా కథలోని ముఖ్యాంశం ఎన్టీఆర్ 'త్రిపాత్రాభినయం'పై ఇప్పటికే మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఈ క‌థ‌లో ట్విస్ట్ లు చాలా కొత్త‌గా ఉన్నాయ‌ని.. అందుక‌నే ఎన్టీఆర్ ఈ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తాను కథలో నావల్టి ఫీలైన అంశమే అప్పుడే మీడియాలో వార్తలుగా వచ్చేయటంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారట.

దాంతో ఆ స్క్రిప్టు ఎలా బయిటకు వెళ్లిందనే విషయమై దర్శకుడు బాబీపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఇంకా సినిమా ప్రారంభం కాకుండానే కథలోని ముఖ్యాంశాలు లీక్ కావడం ఏమిటి, ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటుంది, కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అంటూ బాబీపై ఎన్టీఆర్ మండిపడ్డాడని చెప్పుకుంటున్నారు. అసలు లీక్ అనేది నిజమే అయితే ...ముందు ఆ లీక్ తమ టీమ్ లో ఎవరినుంచి బయిటకు వెళ్లిందనే విషయం ఎంక్వైరీ చేసుకోవాలి తప్పదు.

ఇక జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చేసంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసే విషయం నిజమే అయితే అభిమానుల‌కు పండ‌గే..!

English summary
NTR is going to team up with director Bobby for his next film. This film is to be produced by Nandamuri Kalyan Ram under NTR Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu