»   » ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ గా ఎన్టీఆర్?

ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ గా ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ...చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రం అక్టోబర్ 10 వ తేదిన విడుదల కానుంది. చిత్రం సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. సినిమా లో మిగిలిన భాగం స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిజమా కాదా తెలియాలంటే రిలీజ్ దాకా వేచి ఉండాల్సిందే.

ఇక 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం హంసా నందిని పై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేసారు. ప్రభాస్ 'మిర్చి' ఐటం సాంగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం ఎన్.టి.ఆర్ తో స్టెప్పు లేయడంతో ఫ్యాన్స్ లో ఆనందం కలుగుతోంది.

దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. అలాగే... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.


అలాగే ... 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

English summary
NTR,Samantha, Shruthi Hassan starrer ‘Ramayya Vastavayya’ directed by Harish Shankar is releasing on October 10th in a grand manner. According to the latest, NTR will be seen in the role of a powerful police officer in the flash back while he will be seen as a student for most of the film. Sources say, the flash back scenes will be power packed with emotions. Shruthi will be seen in the role of Ammulu. Dil Raju is producing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu