»   »  ఎన్టీ ఆర్ తో భాస్కర్?

ఎన్టీ ఆర్ తో భాస్కర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
'బొమ్మ రిల్లు' భాస్కర్ అదృష్టం యేంటో గానీ మొన్న 'పరుగు' రిలీజుకు ముందు విక్రమ్ తో సినిమా అన్నారు. తర్వాత చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తో సినిమా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా అంటున్నారు. అదీ దిల్ రాజు బ్యానర్ లోనట. అందులోనూ ఈ వార్త నిజమయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. దిల్ రాజు తో ఎన్టీ ఆర్ సినిమా చేస్తారని కమిట్ మెంట్ ఉందని వారి సన్నిహితులు చెప్తున్నారు. అయితే మళ్ళీ భాస్కర్ తో ముచ్చటగా మూడోసారి దిల్ రాజు చేస్తాడా అన్నది సందేహమే అంటున్నారు ఆయన యూనిట్ సభ్యులు.

అందులోనూ పరుగు కథ మొదట ఎన్టీ ఆర్ కే చెప్పాడుట భాస్కర్ . అయితే అది విన్న ఎన్టీ ఆర్ నేను సినిమా సగం దాకా ఒక గదిలో మ్రగ్గిపోవాలా అని రిజక్ట్ చేసినట్లు అప్పుడు భాస్కర్ బొమ్మరిల్లు కథ చెప్పి సినిమా పూర్తి చేసాడని అంతర్గత సమాచారం. అప్పటి కథ ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ బాగానే కురిపిస్తూండటంతో దిల్ రాజు,ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయినా ఎన్టీ ఆర్ మాస్ ఇమేజ్...భాస్కర్ క్లాస్ కథలో ఇముడుతుందా చూద్దాం అంటున్నారు సీనియర్లు. ఇదీ ఆలోచించాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X