For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ రీమేక్ కు జూ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?

  By Srikanya
  |

  హైదరాబాద్: జూ.ఎన్టీఆర్ తాజాగా ఓ చిత్రం రీమేక్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అది మరేదో కాదు కమల్ హాసన్ నటించిన సాగరసంగమం. రెండు నెలల క్రితం ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ ని కలిసి ఈ ప్రపోజల్ పెట్టాడని వినికిడి. అదీ కె.విశ్వనాధ్ దర్శకత్వంలో సినిమా అని, నృత్య ప్రదానంగా ఉండే కథని ఈ కాలానికి మార్చి స్క్రిప్టు చేస్తే తాను చేయటానికి సిద్దమే అని ఎన్టీఆర్ తాజాగా ఆయనకు కన్ఫర్మ్ చేసి చెప్పినట్లు సమాచారం.

  ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వూ లో కూడా కె.విశ్వనాధ్ గారు తనను ఎన్టీఆర్ ని కలిసి తనకు సాగరసంగమం అంటే ఇష్టమని రీమేక్ చేయమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఓ మాస్టర్ పీస్ అని ఆ సినిమాని మళ్లీ చేయటం రిస్క్ అని అంటున్నారు. అయితే ఈ మేరకు నెగోషియేషన్స్ జరుగుతున్నాయని,అన్నీ కలిసి స్క్ర్రిప్టు నచ్చితే ఎన్టీఆర్ చేసే ఆవకాసముందని తెలుస్తోంది.

  ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ 'బాద్‌షా' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వినోదాన్ని యాక్షన్‌ కథల్లో మేళవించే దర్శకుడు శ్రీను వైట్ల. కథానాయకుడి చేత పోరాటాలతో హంగామా చేయిస్తారు... వినోదమూ పండిస్తారు. ఈ తరహా పాత్రల్లో ఒదిగిపోయే హీరో ఎన్టీఆర్‌. వీరిద్దరి కలయికలో 'బాద్‌షా' తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

  ''వినోదాత్మకమైన కథ ఇది. ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. హైదరాబాద్‌ పరిసరాల్లోనే షూటింగ్ త్వరలో మొదలుపెడతాం. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్‌ బాణీలు హుషారుగా సాగిపోతాయి''అని నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు.ఇటీవలే ఇటలీ, స్విట్జర్లాండ్‌లలో చిత్రీకరణ జరిగింది. అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ గీతాన్ని తెరకెక్కించారు. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడే రెండు పాటలు కాజల్,ఎన్టీఆర్ మధ్యన తీయనున్నారు.

  ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

  English summary
  Ntr would do a movie in the direction of K.Viswanath and the movie would give importance to classical dance. Thereafter, there were no indications of ntr doing movie in the combo of K.Viswanath.Talking to the newsmen in one of his recent interviews, K.Viswanath revealed that ntr had approached him recently asked him to do the remake of great actor Kamal Hassan’s ‘Sagara Sangamam’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X