»   » సుకుమార్ తర్వాత: ఎన్టీఆర్ నెక్ట్స్ ఖరారు...11 న ప్రకటన

సుకుమార్ తర్వాత: ఎన్టీఆర్ నెక్ట్స్ ఖరారు...11 న ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్లే అని తెలుస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణ సోదరుడు సూర్యదేవర నాగ వంశీ (లవర్స్ చిత్రం నిర్మాత) ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ నెల 11 న ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత కొద్ది రోజులుగా నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రం అంటూ రూమర్స్ వచ్చాయి. ఈ వార్తతో ఈ రూమర్స్ కు బ్రేక్ పడినట్లే. చాలా కాలంగా ఎన్టీఆర్...త్రివిక్రమ్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ కుదరటం లేదు. ఇన్నాళ్లకు వర్కవుట్ అయ్యింది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ గా మిగిలిపోయేలా త్రివిక్రమ్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

Ntr new film with Trivikram Confirmed

ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం షూటింగ్ లేటవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు, రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపధ్యంలో చిత్రం ముహూర్తం గురించి విషయం తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు మొదలవుతుందీ, అప్పుడు మొదలవుతుందీ అన్న ప్రచారం ఎన్నోసార్లు వినిపించగా ఇప్పటికీ సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు.

కాగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జూలై మొదటి వారంలో లండన్‌లో ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇక జూన్ 28నే సినిమా యూనిట్ లండన్‌కు పయనం కానుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..' అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ‘అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
Trivikram will be directing NTR and the film will go on floors soon.NTR will start working on the project as soon as he completes his next film with Sukumar. The producers of recent Telugu film “Lovers” are expected to bankroll this project.
Please Wait while comments are loading...