»   » తూచ్...మాది యాక్షన్ కాదు..కామెడీనే

తూచ్...మాది యాక్షన్ కాదు..కామెడీనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం బయిట కామెడీ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద హీరోలు సైతం తమ చిత్రాలు కామెడీతో నిండి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆ విషయం ప్రేక్షకులకు తెలియాలి కదా అందుకే మీడియా ద్వారానూ తమ చిత్రం కామెడీనే...యాక్షన్ కాదు అని చెప్పటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ తాజా చిత్రం రభస కు అలాంటి ప్రమోషన్ చేస్తున్నారు. టీజర్ ద్వారా ఈ చిత్రం యాక్షన్ అనే ముద్ర వచ్చింది. దాంతో మాది యాక్షన్ చిత్రం కాదు...కామెడీ చిత్రమే అని పనిగట్టుకుని మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రభస'. సమంత, ప్రణీత హీరోయిన్స్. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. టాకీ భాగం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఇటలీలో ఓ పాట తెరకెక్కించబోతున్నారు. ఎన్టీఆర్‌, సమంత ఆడిపాడే ఆ పాటతో సినిమా పూర్తవుతుందని తెలిసింది. ఇదే నెలలో గీతాల్ని విడుదల చేస్తారు. వినోదం, యాక్షన్‌ సమపాళ్లల్లో మేళవించి చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

NTR Rabhasa is Comedy entertainer

నిర్మాత మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్‌ సినిమా అంటే ఫైట్స్ , డ్యాన్సులే కాదు. నవ్వించడంలోనూ ఆయన ముందుంటారు. 'అదుర్స్‌'తోనే ఆ విషయం తేలిపోయింది. ఆ చిత్రాన్ని గుర్తుకు తెచ్చేలా 'రభస'లోనూ వినోదాలు పండించారు. రెండు కోణాల్లో సాగే పాత్రలో ఎన్టీఆర్‌ ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది''అని స్పష్టం చేశారు. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Rabhasa has been shaped up with full length comedy and action entertainer. High dosage of comedy to thrill the fans of NTR in this triangular love story. The scenes between Samantha, Pranitha and NTR will be entertaining to most.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu