»   »  ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ...రిస్క్ తీసుకుంటున్నట్లా?

ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ...రిస్క్ తీసుకుంటున్నట్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సీక్వెల్ అనగానే హీరోలు, దర్శకులు ఎంత ఉత్సాహం చూపిస్తారోఅంత ఆచితూచి అడుగులు వేస్తారు. నిర్మాతకు...సీక్వెల్ అనగనే వెంటనే బిజినెస్ అయిపోతుందనే నమ్మకం ఉంటుంది కానీ...దర్శకుడు, హీరో భయపడతారు. ఎందుకంటే సీక్వెల్ లో విజయం సాధించినవి తక్కవ శాతం. దానికి తోడు...సీక్వెల్ అనగానే ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోవటం జరుగుతూంటుంది.వాటిని రీచ్ కాగలమా లేదా అనే భయం ఉంటుంది. తొలి హిట్టైన సినిమాతో ఈ సీక్వెల్ కు ప్రతీ విషయంలోనూ పోలిక ఉంటుంది. వీటినన్నటినీ దృష్టిలో పెట్టుకునే సీక్వెల్స్ అంత తేలిగ్గా ప్లాన్ చేయటానికి ఫామ్ లో ఉన్న హీరో, దర్శకుడు ఇష్టపడరు. ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే... ఎన్టీఆర్...అదుర్స్ 2 సీక్వెల్ ఓకే చేసారని ఫిల్మ్ నగర్ సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నయనతార, షీల హీరోయిన్స్‌గా వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అదుర్స్‌' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్‌ను ‘అదుర్స్‌' చిత్రం బయటకు తీసుకు వచ్చింది. అప్పటి వరకు యాక్షన్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమయిన ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌'తో తాను కూడా కామెడీ చేయగలనంటూ నిరూపించుకున్నాడు. ఆ చిత్రం ఘన విజయం అవ్వడంతో దానికి సీక్వెల్‌ తీసుకు రావాలని ఎన్టీఆర్‌, వినాయక్‌లు చాలా కాలంగా భావిస్తున్నారు.

దీనికోసం వినాయక్ స్ర్కిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్.కోన వెంకట్, గోపీ మోహన్ ఈ స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అయితే ‘అదుర్స్-2'ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అయితే అఖిల్ సినిమాతో వినాయక్ బిజీగా ఉండగా...ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వీరి ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తవగానే ‘అదుర్స్-2' పట్టాలెక్కనుందని సమాచారం.

NTR's green signal for Adurs's sequel?

మరో ప్రక్క ఈ చిత్రంలో హీరోయిన్స్ సైతం ఫైనల్ అయ్యారని టాక్. ‘అదుర్స్2' చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల తార నయనతారతో పాటు అందాల ముద్దుగుమ్మ ఆండ్రియాలు నటించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్, నయనతార జంట అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్‌లో నయనతో పాటు ఆండ్రియా జతయ్యింది.

అయితే... వినాయిక్ ఆ మధ్యన మాట్లాడుతూ... అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక ఆ మధ్యన జరిగిన టెంపర్ ఆడియో ఫంక్షన్ లోనూ త్వరలోనే అదుర్స్-2 తెరకెక్కబోతున్నట్టు హింట్ ఇచ్చాడు వినాయక్. అదుర్స్-2 చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో అదుర్స్-2 ఆరంభమవడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్.. ఏ రేంజిలో అదుర్స్ అనిపిస్తుందో చూడాలి.

English summary
NTR gave green signal for the Adurs's sequel and after NTR completes his film with Sukumar and Vinayak wraps up Akhil's debut project, the film will go to sets. Buzz is Nayanatara will be the heroine in the film and in place of Sheela, Andrea Jermiah will be starring in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu