»   » ఎన్టీఆర్ కొత్త చిత్రం “జై లవ కుశ ” కథ ...ఆ సినిమానుంచి లేపారా ?

ఎన్టీఆర్ కొత్త చిత్రం “జై లవ కుశ ” కథ ...ఆ సినిమానుంచి లేపారా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్ద హీరో ప్రారంభం కాగానే ఆ సినిమాపై రకరకాల రూమర్స్ మీడియాలో మొదలవటం అత్యంత సాధారణ విషయం. ఇప్పుడు ఎన్టీఆర్, బాబి కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం "జై లవ కుశ " (ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు) పైన కూడా అలాంటి రూమర్సే బయిలు దేరాయి. ఈ చిత్రం ఓ తమిళ సినిమా ఆదారంగా రూపొందుతోందని వార్త.


ఇప్పటికే ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడని వార్త వచ్చింది. దాంతో ఈ సినిమా కథ తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా ఆధారం గా తీసుకున్నారని చెప్పుకోవటం మొదలైంది. దాదాపు పదేళ్ల క్రితం అజిత్ నటించిన "వరలారు" అనే సినిమా లో అజిత్ మూడు విభిన్న పాత్రలతో అలరించాడు.ఇక ఈ సినిమా 2006 లోనే తమిళనాట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఆధారంగా ఈ కథ అల్లారని ప్రచారం చేస్తున్నారు.

NTR’s Jai LavaKusa inspired from Ajith’s Varalaaru ?

మరో ప్రక్క ఈ సినిమా కథ గురించి మరో ప్రచారం మొదలైంది. అదేమిటంటే...ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్ గా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఏమిటంటే .. ఆ రెండు పాత్రలకి తండ్రిగా వుంటుందట. అంటే .. తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఏదైమైనా ఈ మూడు పాత్రలు ఏమిటి వాటిల్లో ఎన్టీఆర్ ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు అభిమానులు.


ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ 'జై లవ కుశ' పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈచిత్రానికి బాలీవుడ్లో 3 ఇడియట్స్, పికె, మోహంజోదారో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ పనిచేయబోతున్నారు. రవితేజ తో 'పవర్', పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలను తరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
There is a buzz that Jr. NTR’s 27th film tentatively titled as Jai LavaKusa film is on the lines of Ajith’s 10 year old film Varalaaru in which Ajith play a triple role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu