»   » 'నాన్నకు ప్రేమతో' : టైం దగ్గర పడింది..ఏం జరుగుతోంది

'నాన్నకు ప్రేమతో' : టైం దగ్గర పడింది..ఏం జరుగుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. సంక్రాంతికు ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

దాంతో నిన్న మెన్నటి వరకు కూల్ గా వెళ్ళినా, ఒక్కసారిగా ఊపు అందుకుంది..ఈ నేపధ్యంలో చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ , మరో ప్రక్క మిగిలిన షూటింగ్ భాగం పూర్తి చేసే పనిలో యూనిట్ ఉంది. ఈ విషయమై రకుల్ ప్రీతి సింగ్ ట్వీట్ చేస్తూ డబ్బింగ్ చెప్తున్నానంది.సినిమాలో కొంత పార్ట్ టాకీ , ఓ సాంగ్ మిగిలివున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వీటిని త్వరగా పూర్తి చేయ్యాలని అనుకుంటున్నారు..అందుకే ఒక పక్క హైదరాబార్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ ను వెస్తున్నారు . మిగిలిన పాటను, టాకీ సీన్స్ ను తీయాడానికి...ఈలోపు ఎన్టీఆర్ తన పార్ట్ డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్దపడుతున్నాడు..


నిర్మాత మాట్లాడుతూ ''తండ్రీ కొడకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తారక్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో, విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Ntr's Nannaku Premato patch work going on

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. 60 రోజులపాటు లండన్‌లో షూటింగ్ జరిగింది. తర్వాత స్పెయిన్ లోని రేర్ లొకేషన్లలో షూటింగ్ జరిపారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుంద.


English summary
Shooting of Nannaku Prematho has been wrapped up barring a song and some patch work. song will be shot in Hyderabad and a special set has been erected in Annapurna Studios .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu