»   » ఎన్టీఆర్,కొరటాల శివ చిత్రం టైటిల్

ఎన్టీఆర్,కొరటాల శివ చిత్రం టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'హడల్' అనే టైటిల్ పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు చెప్పుతున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తారు.

రచయితగా కొరటాల శివ మంచి పేరు తెచ్చుకుని, 'మిర్చి'తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ కావడంతో శివ సీన్ జాతకం మారిపోయింది. స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వస్తోంది. వాటిలో రామ్‌చరణ్ పేరు ముందు వినిపించినా, ఇప్పుడా ప్రాజెక్ట్ లేదని వినికిడి. మహేష్‌బాబు హీరోగా వచ్చే ఏడాది శివ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. ఈ లోగా ఎన్టీఆర్ హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్‌ని శివ కలిశారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వినిపిస్తోంది.

మిర్చి హిట్ అవగానే కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ప్రకటన వచ్చింది. అనుకోని విధంగా ఆ చిత్రం ఆగిపోయింది. ఆ కథే ఇప్పుడు ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కథ వినగానే వెంటనే ఎన్టీఆర్ ఓకే చేసాడని చెప్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మాణం కానుంది.


ఇక ఎన్టీఆర్ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. తన తాజా చిత్రాలు రభస, రామయ్య వస్తావయ్యా సెట్స్ మీద ఉండగానే మరో చిత్రం కమిటయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రం ఓకే చేసాడని తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రం నిర్మిస్తారు. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. మరో ప్రక్క త్రివిక్రమ్,సుకుమార్, వక్కంతం వంశీ చిత్రాలుకు కూడా ఎన్టీఆర్ ఓకే చేసారు.

English summary
NTR who is currently busy with 'Ramayya Vastavayya' and 'Rabhasa' is already setting his sights on his next project with Koratala Siva of Mirchi fame. According to sources film makers are planning to titled the film as Hadal. Siva already registered the title with the film chamber. Film will be going to sets this year end.
Please Wait while comments are loading...