»   » ఎన్టీఆర్ కొత్త సినిమాకు వీసా టెన్షన్స్

ఎన్టీఆర్ కొత్త సినిమాకు వీసా టెన్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి వీసా సమస్యలు ఎదురౌతున్నట్లు సమాచారం. జూన్ 3 నుంచి లండన్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి మొదట ఛాయాగ్రాహకుడుగా రిచ్చర్డ్ ప్రసాద్ ని అనుకోవటం జరిగింది. అయితే ఆయనకి రెండు సార్లు వీసా సమస్య ఎదురుకావటంతో ...ఆయన ప్లేస్ లోకి విజయ్ చక్రవర్తి ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యూకే నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. మేజర్ పార్ట్ షూటింగ్ సైతం అక్కడే జరుపుతారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Ntr,Sukumar movie facing visa tensions

నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని తెలిపారు.

జూన్ మొదటి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, సాహసం, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి చేస్తున్న మరో భారీ చిత్రమిది అని బివిఎస్ఎన్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Ntr,Sukumar movie facing visa tensions

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Ntr,Sukumar film faced visa problems for cinematographer Richard Prasad as his visa was rejected not once but twice. Now filmmakers replaced him with Vijay Chakravarthy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu