»   » సిక్స్ ప్యాక్‌లో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సిసిమా ఫాన్స్‌కు పండగే!

సిక్స్ ప్యాక్‌లో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సిసిమా ఫాన్స్‌కు పండగే!

Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం రోజు ప్రారంభమైంది. జైలవకుశ చిత్ర విజయం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. దీనితో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వినోదంతో కూడిన కుటుంబ కథలని తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అలాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ తన నటనతో ఒదిగిపోతాడు. ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఓ ఆసక్తికమైన విషయం ప్రచారం జరుగుతోంది.

Jr NTR Was Gossiped Six-Pack Abs
మొదలుపెట్టిన ఎన్టీఆర్, త్రివిక్రమ్

మొదలుపెట్టిన ఎన్టీఆర్, త్రివిక్రమ్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గత ఏడాదే జరిగాయి. కానీ త్రివిక్రమ్ అప్పుడు అజ్ఞాతవాసి చిత్రంతో బిజీగా ఉండడంతో షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అయింది.

యాక్షన్ సన్నివేశంతో

యాక్షన్ సన్నివేశంతో

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మొదలు పెట్టడమే యాక్షన్ సన్నివేశంతో మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రంగా రూపొందించబోతున్నారు.

 జై లవకుశ తరువాత

జై లవకుశ తరువాత

ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సిక్స్ ప్యాక్ లుక్

సిక్స్ ప్యాక్ లుక్

ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతుతోంది. శుక్రవారం మొదలైన షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలోనే చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ రివీల్ అవుతుందని సమాచారం.

ఎన్టీఆర్ ప్యాన్స్ కు పండగే

ఎన్టీఆర్ ప్యాన్స్ కు పండగే

టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. మళ్ళీ త్రివిక్రమ్ చిత్రంలో అలా కనిపించబోతుండడం ఫాన్స్ పండగ చేసుకునే న్యూస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

English summary
NTR will appear with six pack look in Trivikram movie. Regular shoot begins. Pooja Hegde is female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X