For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ న్యూస్ : NTV సిఈఓ తో పవన్ కళ్యాణ్ చిత్రం

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం కమిటయ్యారు. ఈ సారి NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ నిర్మతగా కొత్త చిత్రం తెరకెక్కనుందని సమాచారం. చాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది. . దీంతో ఓ మంచి కథ వెతికే ప్రయత్నంలో శరత్ ఉన్నాడు. మే 2013 లో ఈ చిత్రం మొదలుకానుందని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. శరద్ మరార్ గతంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసారు. ఆయన కెరీర్ ..అమితాబ్ కు చెందిన ఎబిసిఎల్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ గా మొదలెట్టారు.

  మరో ప్రక్క శరత్ మరార్...చిత్ర సీమ అనే కొత్త ఛానెల్ ని NTV ఆధ్వర్యంలో మొదలు పెట్టానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యులైన కొందరు నిర్మాతలు ఈ ఛానెల్ లో భాగస్వాములుగా ఉండి మరీ ఈ ఛానెల్ ని తెస్తున్నారని తెలుస్తోంది. శరద్ మరార్ గతంలో మాటీవిలోనూ మంచి రేటింగ్స్ తెచ్చారని, ఇప్పుడు ఈ కొత్త తెలుగు సినీ ఛానెల్ ను కూడా ఆయన నిలబడతారని భావిస్తున్నారు. ఇక శరద్ మరార్ కి మొదటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి. పవన్ స్నేహితుడుగానే కాకుండా ఆయన పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.

  ఇక త్రివిక్రమ్ తో పవన్ చేయనున్న చిత్రం వివరాల్లోకి వస్తే...ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్ చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టు ఫైనల్ చేయించుకుని తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

  పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ఈ నెల్లోనే పవన్,పూరీ ల కాంబినేషన్ లో రూపొందిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం విడుదల అవుతోంది.

  English summary
  
 NTV Channel CEO Sharath Marar will be producing the Telugu film in the combination of Pawan Kalyan and Trivikram Srinivas. Sarath Marar earlier was the CEO of MAA TV. He started his career by establishing ABCVL (Amitabh Bachchan Corporation Ltd) office in Hyderabad. He is also the personal friend to Pawan Kalyan which is why he is going to produce this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X