»   » 14 కోట్లు బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ చిత్రమా?

14 కోట్లు బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ చిత్రమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Oh My God remake budget
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చిత్రం అంటే ఎంత బడ్జెట్ ఉంటుంది అంటే కళ్లు మూసుకుని ఎవరైనా మినిమం నలైభై కోట్లు,లేదా దాని పైనే అని చెప్తారు. అయితే ఈ సారి పవన్ చేయబోయే చిత్రం బడ్జెట్ 14 కోట్లు అంటున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెమ్యునేషన్స్ తీసుకోకుండా లాభాల్లో షేర్ తీసుకోనేలా బడ్జెట్ అంచనా వేస్తే 14 కోట్లు వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


అలాగే ఈ చిత్రంలో నదియా..వెంకటేష్ కి భార్యగా కనిపించనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ 22 రోజులు డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఏప్రియల్ నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ దర్శకుడు ఎవరనేది మాత్రం ఖరారు కాలేదు. మొదటి నుంచి అనుకుంటున్నట్లు డాలీ నే ఉంటాడా మరొకరు మారతారా అనేది చూడాల్సిందే.


అలాగే ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది.

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.


కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Pawan Kalyan and Venkatesh will team up for the remake of Bollywood film Oh My God(OMG) in Telugu. Grapevine is that the movie budget is estimated to be 14 Crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu