»   » సీక్రెట్ రివీల్ : పవన్ ఆ రాత్రి..శ్రీజ కాబోయే భర్త ని కలిసి..

సీక్రెట్ రివీల్ : పవన్ ఆ రాత్రి..శ్రీజ కాబోయే భర్త ని కలిసి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాపు ఐక్య గర్జన అనంతరం జనసేన అధ్యక్ష్యుడుగా పవన్ కల్యామ్...కేరళ నుంచి హైదరాబాద్ కు సర్దార్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కాపు గర్జన పై తన అభిప్రాయాలు చెప్పారు.

ఆ మరుసటి రోజు జెఎహెచ్ ఎమ్ సీ పోలింగ్ లో ఓటు కూడా వేయకుండా ఆయన కేరళ వెళ్లిపోయారు. అయితే ఫిబ్రవరి 1 రాత్రి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో గడిపినట్లు సమాచారం. హఠాత్తుగా చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరమైన అంశం.

అందుతున్న సమాచారం ప్రకారం...పవన్ తన సోదరుడు చిరంజీవిని, ఆయన ఫ్యామిలీని చిరంజీవి ఇంట్లో కలిసారు. కేరళ వెళ్లేముందు జరిగిందా సంఘటన. ఆ సమయంలోచిత్తూరు నుంచి చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కాబోయే భర్త ని, అతని కుటుంబాన్ని చిత్తూరు నుంచి రప్పించారని సమాచారం.

వచ్చాక పవన్ కళ్యాణ్ సమక్షంలో వివాహ తేదీ, మిగతా ఫార్మాలిటీస్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బాబాయ్ గా ఇదంతా పవన్ ఉండగా జరిగితే బావుంటుందని చిరంజీవి భావించటంతో పవన్ ఇలా షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

On that night Pawan met Srija's fiance

ఇలా తన ఇంటికి రమ్మనమని ఇన్వైట్ చేయటానికే చిరంజీవి ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కు వెళ్లి మరీ పిలిచినట్లు సమచారం. వేరే రోజు ఈ పోగ్రామ్ పెట్టుకుందామనుకున్నా..బిజీ షెడ్యూల్ తో దొరకని ఎలాగూ పవన్ ..సిటీకి వచ్చారు కదా అని చిత్తురు నుంచి వారిని రప్పించి పని పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు ముందుగా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తొలినుంచీ తన అన్నయ్యకు, అన్న కుటుంబం అంటే అభిమానం చూపిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. బయిట ఎన్నిరూమర్స్ వస్తున్నా..పొలిటికల్ గా ఎన్ని విభేధాలు ఉన్నా పవన్ కు తన అన్నయ్యని చాలా ప్రేమగా చూస్తూంటారు. ఇదే విషయం మరో సారి ప్రూవ్ అయ్యింది.

English summary
Pawan met his brother Chiru and his family at Chiru's residence on February 1 night before he left for Kerala.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu