Just In
- 30 min ago
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- 52 min ago
బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు
- 58 min ago
ప్రదీప్ ఆరోగ్యంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్: అతడి నవ్వు వెనుక అంతటి బాధ ఉందంటూ ఎమోషనల్!
- 1 hr ago
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
Don't Miss!
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Automobiles
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు పవన్ కాంబో.. కలిసేవరకు వదిలేలా లేరు, స్పెషల్ పాత్రలో సర్‌ప్రైజ్
టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తే అంతకంటే పెద్ద ఫెస్టివల్ మరొకటి ఉండదు. కానీ దర్శకులకు వారిని డీల్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఏ మాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా కూడా ఫ్యాన్స్ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే ఈ ఇద్దరు కలిసి నటించే వరకు రూమర్స్ డోస్ తగ్గేలా లేవని అనిపిస్తోంది.

స్టార్ హీరోల సినిమాల్లో పవన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిన తరువాత సినిమాలు చేస్తారో చేయరో అనుకున్న సమయంలో సడన్ గా వరుస ప్రాజెక్టులను లైన్ లోకి తెచ్చి అభిమానులకు మంచి కిక్కిచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. పిరియాడిక్, మల్టీస్టారర్ కథలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక త్వరలో ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రలతో కూడా మంచి క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

పవన్, మహేష్ కలిసి నటిస్తే..
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కువసార్లు కలుసుకోకపోయినప్పటికి ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతారు. పవన్ పుట్టినరోజున మహేష్ విష్ చేయగా ఆ ట్వీట్ నెవర్ బిఫోర్ అనేలా ట్రెండ్ అయ్యింది. పవన్, మహేష్ కలిసి నటిస్తే బావుంటుందని కోట్లాదిమంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

జోరుగా ప్రచారాలు
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అదొక సెన్సేషన్. ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సోషల్ మీడియాలో అయితే అభిమానులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.

సర్కారు వారి పాటలో పవన్
నెక్స్ట్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అతిధి పాత్ర చేయనున్నట్లు టాక్ అయితే వస్తోంది. కథను మలుపు తిప్పే అతి ముఖ్యమైన పాత్రలో పవన్ పవర్ఫుల్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. గత పదేళ్లుగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బావుంటుందని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.