twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి ఆలస్యం కానున్న రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ముందుజాగ్రత్తగా నేతల వ్యూహాలు?

    |

    రాజకీయాలు అనగానే వెంటనే గుర్తొచ్చే రాష్ట్రం తమిళనాడు. నిత్యం వర్గ పొరుతో అక్కడ ఏదో ఒక వివధాలు చెలరేగుతూనే ఉంటాయి. జాగ్రత్తగా లేకపోతే నిమిషాల్లో అధికారాలు మారిపోతాయని అందరికి తెలిసిందే. ఇక అలాంటి తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా నిలదొక్కుకుంటారు అనేది మొదటి నుంచి అనేక మందిలో రగులుతున్న సందేహం. ఇక ప్రస్తుతం రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అసలు ఉంటుందా లేదా అనేది మరొక పెద్ద మిస్టరీగా మారింది.

    వాగ్దానాలను నెరవేర్చలేకపోతే..

    వాగ్దానాలను నెరవేర్చలేకపోతే..

    2017 డిసెంబర్‌లో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ దేశమంతా ఆశ్చర్యపోయేలా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ గురించి తెలుపుతూ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు. రజినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోతే తన పార్టీ రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారు.

    రజినీకాంత్ ప్రణాళికలను దెబ్బకొట్టిన కోవిడ్

    రజినీకాంత్ ప్రణాళికలను దెబ్బకొట్టిన కోవిడ్

    అంతా బాగానే ఉంది కాని.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నా తలైవా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తన రాజకీయ పనులను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్లాన్ మొత్తం కోవిడ్ -19 వల్ల దెబ్బతిన్నాయి. అసలైతే రజనీ తన నెక్స్ట్ మూవీ ‘అన్నాతే' షూటింగ్‌ను ముగించి, ఆపై రాజకీయాలపై దృష్టి పెట్టాలని అనుకున్నారు.

    ఆ సినిమా పూర్తి చేసిన తరువాత

    ఆ సినిమా పూర్తి చేసిన తరువాత

    ఇక ‘అన్నాతే' షూట్ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని అనిపిస్తోంది. ఆలస్యం అవుతూనే ఉంది కాబట్టి రజనీ తన రాజకీయ ప్రణాళికలకు ఆచరణలో పెట్టడానికి మరింత ఆలస్యం అయ్యేలా ఉందని అనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రజినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పనులను ప్రారంభించాలనుకుంటున్నారు.

     కమల్ హాసన్స్ రజినీకాంత్ కలుస్తారా?

    కమల్ హాసన్స్ రజినీకాంత్ కలుస్తారా?

    మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలకు రజిని, కమల్ హాసన్ చేతులు కలపవచ్చు అనే వార్తలు కూడా గట్టిగానే వచ్చాయి. గతంలో ఒకసారి రజినీకాంత్ భవిష్యత్తు రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మళ్ళీ రజినీకాంత్, కమల్ ఇద్దరూ ఎప్పుడూ కూడా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేదు. మరి ఈ క్లిష్టమైన పరిస్థితులలో రజినీకాంత్ ఎలాంటి అడుగులు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

    బలాన్ని పెంచుకుంటున్న ఇతర పార్టీలు

    బలాన్ని పెంచుకుంటున్న ఇతర పార్టీలు

    ఇక మరోవైపు రజినీకాంత్, కమల్ హాసన్ తప్పకుండా పాలిటిక్స్ లో ఎదో ఒక రకంగా ప్రభావం చూపుతారని ఇతర రాజకీయ పార్టీలు వారి బలాన్ని మరింత పెంచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార ఎఐఎడిఎంకె, డిఎంకె తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎఐఎడిఎంకె తమ సిఎం అభ్యర్థిని కూడా ప్రకటించగా, మరో సైన్యం ఎంకె స్టాలిన్ నేతృత్వంలో ఎలాంటి పరిస్థితులలో అయినా విజయం సాధించాలని డిఎంకె వ్యూహాలను రూపొందిస్తోంది.

    English summary
    Superstar Rajinikanth is making films without any gap whatsoever. Even at the age of 70s, there is no drop in speed. Thalaivaa is completing his film shootings in shorttime. But recently the star hero made a tough decision regarding his next movie. The box office seems to be getting a hit anyway in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X