»   » ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయితే మెగా ఫ్యాన్స్ కి మరో పరాభవం తప్పదు...?

ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయితే మెగా ఫ్యాన్స్ కి మరో పరాభవం తప్పదు...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ ఆర్ రెహమాన్ తెలుగులో డైరెక్ట్ గా మ్యూజిక్ చేసిన సినిమాల్లనీ ప్లాప్ అనే సెంటిమెంట్ ఒకటుంది. 'ఏమాయ చేసావె" తమిళ్ వెర్షన్ కి ఇచ్చిన మ్యూజిక్ నే ఇక్కడ వాడుకున్నారు కాబట్టి అది రెహమాన్ స్ట్రెయిట్ తెలుగు ఫిలిం కింద కౌంట్ కాదనే చెప్పాలి. రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన 'సూపర్ పోలీస్", 'నాని" తదితర సినిమాలన్నీ మట్టి కరిచాయి. తాజాగా అతని ప్లాపుల లిస్ట్ లో 'పులి" కూడా చేరి సెంటిమెంట్ ని నిలబెట్టింది.

తన గురువు ఎఆర్ రెహమాన్ కి కలిసి రానట్టే హేరీస్ జైరాజ్ కి కూడా తెలుగు అచ్చి రాలేదు. అతను తెలుగులో చేసిన సినిమాలు 'వాసు", 'ఘర్షణ", 'సైనికుడు", 'మున్నా" అన్నీ ప్లాపయ్యాయి. తాజాగా అతను చరణ్ నటిస్తోన్న 'ఆరెంజ్" చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా హేరిస్ ప్లాప్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తే మెగా ఫ్యాన్స్ కి మరో పరాభవం తప్పదు. అయితే యువన్ శంకర్ రాజాకి కూడా గతంలో ఈ సెంటిమెంట్ ఉండేది కానీ 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమా దానిని మార్చింది. 'ఆరెంజ్" సినిమా హేరిస్ కి అలాంటి తీపి గుర్తునే మిగులుస్తుందని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu