»   » రామ్ చరణ్ ఆరెంజ్ కర్ణాటక రైట్స్ అంతా?

రామ్ చరణ్ ఆరెంజ్ కర్ణాటక రైట్స్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరెంజ్...ఆ రేంజే వేరు చిత్రం మార్కెట్లో ఆ రేంజే వేరు అన్నట్లు రికార్డుతో దూసుకుబోతోంది. తాజాగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మూడు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఏ తెలుగు చిత్రానికి రాని ఎమౌంట్ వచ్చిందని చెప్తున్నారు. మగధీర చిత్రం కర్ణాటకలో బాగా ఆడటంతో ఈ చిత్రానికి ఆ రేంజి మార్కెట్ వచ్చినట్లు చెప్తున్నారు. ఇక మొన్న ఆరున్నర కోట్లకు శాటిలైట్ రేట్స్ పలికాయన్న వార్త వచ్చిన సంగతి తెలిసింది. ఇవన్నీ ఒకెత్తు అయితే తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి మార్కెట్ పలుకుతుందని నిర్మాత నాగబాబు లెక్కలు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu