twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు చిత్రాలు కలిపితే 'పంజా'నా?

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గతంలో వచ్చిన పవన్ చిత్రం బాలు,నాగార్జున చిత్రం అంతం ల మిక్సర్ గా ఉండబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. గత రెండు రోజులుగా ఇదే టాపిక్ నడుస్తోంది. రెండు చిత్రాలు మాఫియా బ్యాక్ డ్రాఫ్ లో నడవటంతో అలాంటి సినిమా కావచ్చునని అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన 1993 లో అల్ పచినో చేసిన Carlito's Way చిత్రం తెలుగు వెర్షన్ ని కొందరంటున్నారు. అలాగే సెకండాఫ్ లో బ్రహ్మానందం కామెడీ హైలెట్ అవుతుందని చెప్తున్నారు. బ్రహ్మానందం పాపారాయుడు అనే ఫోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అతనిది రెడీ తరహాలో నడిచే కామిడీ అని, పవన్ అతన్ని అడ్డం పెట్టి తన ప్రత్యర్దులను తుద ముట్టిస్తాడని అంటున్నారు.

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాకు ఎ సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ చిత్రం రేపు అనగా డిసెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల అవుతోంది. నైజాంలోనే 190 ప్రింట్లతో ఈ చిత్రం విడుదల అయ్యి రికార్డు క్రియేట్ చేస్తోంది.ఇక 'పంజా' చిత్రం కథ పవన్‌కళ్యాణ్‌కు సరిపోయే కథ అనీ, ఎప్పటినుంచో ఇలాంటి కథాంశంతో చేయాలని ఎదురుచూశామనీ, అంతర్లీనంగా దేశభక్తి ప్రభోదించే అంశాలున్నాయనీ, ఇలాంటి చిత్రాన్ని తీయటం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌, విష్ణువర్ధన్‌తో కలిసి మా దగ్గరకు వచ్చారు. దర్శకుని వద్ద మంచి కథ ఉంది. ఆ కథ పవన్‌కు బాగా నచ్చింది. ఇప్పటిట్రెండ్‌కు సరిపడే కథాంశం. 'పంజా' అనే టైటిల్‌ కథలో పవన్‌ పాత్రకు సరిపోయేట్లుగా ఉంటుంది.

    English summary
    Panjaa is a stylish and slick action entertainer with a mafia backdrop set in Kolkata.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X