»   » పవన్ కళ్యాణ్ మరోసారి భారీగా పెంచేసి....?

పవన్ కళ్యాణ్ మరోసారి భారీగా పెంచేసి....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో వచ్చిన 'పంజా' సినిమాలో భారీగా గడ్డం పెంచి సరికొత్త లుక్‌తో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ లుక్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు అందాయి కానీ....సినిమా మాత్రం పెద్ద ప్లాపయింది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. 'గోపాలా గోపాలా' చిత్రంలో దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గడ్డంతో కనిపిస్తారట.

సాధారణంగా తెలుగు సినిమాల్లో దేవుళ్లంతా గడ్డం లేకుండానే కనిపిస్తారు. కానీ దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గడ్డంతో కనిపించడం ఏమిటని....ఈ రూమర్స్ విన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత? ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ గడ్డంతో కనిపిస్తారా? లేక సాధరాణంగా కనిపిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Pawan beard look again

వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వెంకీ సరసన 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేకే ఈచిత్రం.

English summary

 Pawan might be using a beard all over again for his new film ‘Gopala Gopala’, where he will be seen as God. This is the latest rumour circulating in filmnagar right now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu