twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే పవన్ కి అంత ఆదరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒక నటుడుకి జనం నీరాజనాలు పట్టడం,విపరీతమైన అభిమానుల ఆదరణ వాటంతట అవే వచ్చేయవు. తాము చేస్తున్న పాత్రలో లీనమవటమే కాక, లీనమవటానికి, పాత్రకు మరింత వన్నె తేవటానికి నటుడు లేదా హీరో చేసే కృషి తెరపై కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ లో మరింత ఎక్కువ. తాను చేసే పాత్ర కోసం ఆయన రీసెర్చ్ వర్క్ తరహాలో కష్టపడుతూంటారు. పాత్రకు ప్రాణం పోయటానికి ఆయన శాయశక్తులా కృషి చేస్తూంటారు. అందుకే గబ్బర్ సింగ్ లాంటి పాత్ర అంత పెద్ద హిట్ అయ్యింది. గోపాల గోపాల చిత్రంలతో తాను చేయబోయే కృష్ణుడు పాత్ర లోతుల్లోకి వెళ్లటానికి పవన్ ఇప్పుడు మళ్లీ రాత్రింబవళ్లు అవే ఆలోచనలతో గడుపుతున్నారని సమాచారం. అందుకోసం ఆధ్యాత్మక సంభంధ పుస్తకాలు రిఫెర్ చెయ్యడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. పాత్ర ఎక్కడా విమర్శలకు లోను కాకూడదని దర్శకుడుకి గట్టిగా చెప్పారని వినపడుతోంది.

    'ఓ మై గాడ్‌'కిది రీమేక్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేష్‌, శ్రియ ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ త్వరలో బృందంతో కలుస్తారు. సినిమా కోసం ఆయన 20 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారని సమాచారం. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు నటిస్తున్నారు.

    పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.

    Pawan devoting time to scriptures

    కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

    'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

    భూకంపం వచ్చి ఓ వ్యక్తికి చెందిన దుకాణం కూలిపోతుంది. దీంతో నష్టపరిహారం చెల్లించాలంటూ దేవునిపై కేసు పెడతాడాయన. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రధారులు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థాసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. హిందీలో వచ్చిన 'ఓ మై గాడ్‌'కిది రీమేక్‌. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి

    English summary
    Pawan Kalyan is going to be seen as God in the upcoming movie ‘Gopala Gopala’. To better prepare for the role of God, Pawan is said to be devoting a lot of time to scriptures and devotional books.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X