»   » మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది: పవన్ ఫ్యాన్స్ పాంఫ్లేట్ వేసి మరీ అల్లు అర్జున్ ని...

మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది: పవన్ ఫ్యాన్స్ పాంఫ్లేట్ వేసి మరీ అల్లు అర్జున్ ని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అన్నట్లు ...హీరోలు ..అభిమానలతో పెట్టుకుంటే చాలా కష్టం అని చాలా సార్లు ప్రూవ్ చేసాయి. ఇప్పుడు అల్లు అర్జున్ వివాదంలో అది మరోసారి నిజమౌతోంది. చెప్పను బ్రదర్ అనే చిన్నమాట..చిలికి చిలికి గాలి వానగా మారి ఇప్పుడు తుఫాన్ గా అల్లాడిస్తోంది.

అల్లు అర్జున్, పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం మరో మలుపు తిరిగిందని వినపడుతోంది. సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ ఫ్యాన్స్ తో చెప్పను బ్రదర్ అన్న మాట నేషన్ వైడ్ గా ట్రెండింగ్ అయ్యింది. రెండు రోజులు ఆగి ఆ వివాదం చల్లారి పోతుంది అనుకున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ చాలా ఎగ్రిసెవ్ గా ట్విట్టర్ లో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూ ట్వీట్స్ చేయటం మొదలెట్టారు. ఫేస్ బుక్ లోనూ ఓ రేంజిలో పోస్ట్ లు పవన్ ఫ్యాన్స్ పెట్టారు.

ఆ విషయమూ అంతటా చర్చనీయాంసంగా మారింది. పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయటం మీడియాలో కూడా భారీ ఎత్తున కథనాలతో చర్చగా మారింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు రంగు మార్చుకుని ఫాంప్లేట్స్ తో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అల్లు అర్జున్ పై ఇండైరక్ట్ గా చేస్తున్నారు. అయితే ఎవరైనా ఇట్టే అర్దం చేసుకోగలరు. అల్లు అర్జున్ మీద అని.

Pawan Fans Vs Allu Arjun: The aversion taken a new turn

మొదట హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో మొదలైన ఈ వ్యతిరేకత ఇప్పుడు మిగతా ఫ్యాన్స్ కు పాకింది. చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఇందులో పాల్గొంటున్నారు. మరో ప్రక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం దీన్ని ఖండించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటి ప్రభావం అంతగా కనపడటం లేదు.

మరో ప్రక్క నాగబాబు ద్వారా... ఈ వివాదం ఓ కొలిక్కి తేవాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగబాబు కు మెగా ఫ్యాన్స్ తో గత ముప్పై సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో నాగబాబు అయితే పవన్ ఫ్యాన్స్ ని కలిసి మాట్లాడి, ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెడతారని చెప్పుకుంటున్నారు. మరి ఎంతవరకూ ఈ వివాదం వెళ్తుందో..ఎక్కడ ఆగుతుందో చూడాలి.

English summary
Aversion on ‘Allu Arjun’ among the Pawan fans has not been reduced. Infact, this has taken a new turn now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu