twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పార్టీ జెండా...అజెండా ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ ఇప్పటికే తన పార్టీ జెండా...అజెండా, ఎన్నికల గుర్తు అన్నింటిపైనా ఒక నిర్ణయానికి వచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇజ్రాయిల్ దేశ జాతీయ పతాకంను గుర్తు చేసే విధంగా ఉండనుందని తెలుస్తోంది. ఎర్రగా ఉండే షడ్ చక్రం ను పోలి ఉంటుంది. జండా మధ్యలో ఉండే చక్రం, స్వేచ్చా, విప్లవం,అభివృద్దికి సంకేతాలుగా భావించి డిజైన్ చేయించారని తెలుస్తోంది. అయితే వీటిని ఆ సభలోనే పవన్‌ బహిర్గతం చేస్తారని తెలిసింది.

    అయితే అజెండా మొత్తాన్ని కాకుండా స్థూలంగా పార్టీ లక్ష్యం ఏంటి? విధానాలేంటన్నది ప్రకటించే అవకాశాలున్నాయి. హైటెక్స్‌లో జరిగే సభలో సాయంత్రం 6.30 గంటలకు ఆయన తన ప్రసంగం ప్రారంభిస్తారని సమాచారం. ప్రసంగం ఎలా ఉండాలన్న దానిపై తనకు సన్నిహితంగా ఉన్న సినీ దర్శకుడు త్రివిక్రమ్ తో చర్చించి ఖరారు చేశారని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలమంది అభిమానులు ఈ సభకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు హైటెక్స్‌లో ఒక భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సభలో పవన్‌ ఇచ్చే ప్రసంగాన్ని రాష్ట్రంలోని కొన్ని సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

    Pawan finalizes party flag and symbol

    దీనికోసం థియేటర్ల యజమానులతో పవన్‌ సన్నిహితులు మాట్లాడుతున్నారని తెలిసింది. మరోవైపు అభిమానులు కూడా ఎక్కడికక్కడ భారీ స్క్రీన్‌లు ఏర్పాటుచేసుకుని పవన్‌ ప్రసంగాన్ని చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీని ప్రకటించిన తర్వాత నాలుగైదు రోజులు హైదరాబాద్‌లో ఉండి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అనంతరం ప్రజల్లోకి వెళ్తారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిసింది.

    దాదాపు 45నిమిషాల పాటు ఆయన ప్రసంగం వుంటుందని, అందులో పలు సంచలన నిర్ణయాల్ని వెలువరిస్తారని అభిమానులు అంటున్నారు. ఈ సభలోనే పార్టీ తరపున పోటీ చేయబోయే 40మంది అసెంబ్లీ అభ్యర్థులు, 9మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్‌కల్యాణ్ ఒక్కరే ప్రసంగిస్తారని మీడియా వారితో ఎటువంటి ముఖాముఖి వుండదని తెలుస్తోంది. ఈ సభలో పార్టీ విధివిధానాలను ప్రకటించడంతో పాటు ప్రపంచ సామాజిక, రాజకీయాంశాలపై పవన్‌కల్యాణ్ రాసిన పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. మూడువేల మంది అభిమానులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

    మరో ప్రక్క పవన్‌ కళ్యాణ్‌ కూడా బడుగులకు భారీగా తాయిలాలను ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనున్నట్లు పవర్‌స్టార్‌ వర్టీయులంటున్నారు.అదే విధంగా దాదాపు ఇరవై శాతం దాకా ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌కళ్యాణ్‌ పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పద్దతిలో వ్యవహరిస్తే పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలో నూతన ఒరవడి ని సృష్టిస్తారనే వ్యాఖ్య రాజకీయవర్గాలలో వుంది. తెలంగాణ ప్రాంతంలో బీసీతో పాటు దళిత కార్డును వాడాలని పవర్‌స్టార్‌ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

    English summary
    Pawan's party flag partly resembles the national flag of Israel country however Israel's flag is of blue color instead of red. As Pawan, a huge follower of Che Guevara who is a Marxist leader, he preferred to have red lines in the flag which clearly shows Communist intentions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X