For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్ కళ్యాణ్ దృష్ణి ఆ హీరోయిన్ పై...??

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో దృష్టి తమపై పడితే చాలని చాలా మంది హీరోయిన్స్ ఎదురుచూస్తూంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో నటిస్తే ఓవర్ నైట్ లో సెలబ్రేటి కావచ్చు. మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు. ఈ నేపధ్యంలో పవన్ దృష్టి రకుల్ ప్రీతి సింగ్ పై పడిందని ఇండస్ట్రీ టాక్. పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2' కోసం సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసారని తెలుస్తోంది. రకుల్ ప్రీతి సింగ్ అంటే మరెవరో కాదు...వెంకటాద్రి ఎక్సప్రెస్ లో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఆ చిత్రం మంచి విజయమే సాధించింది.

  'గబ్బర్ సింగ్ 2' చిత్రం లేటవటానికి కారణం స్క్రిప్టు సమస్యే అంటునవ్నారు. రకరకాల కారణాలతో ఈ చిత్రం ప్రారంభం డిలే అవుతూ వచ్చినా స్క్రిప్టు పరంగా పవన్ కి పూర్తి సంతృప్తి చెందాడని అందుకే జనవరి 25,2014 నుంచి కంటిన్యూ షెడ్యూల్ ప్రాంరంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.

  Pawan is Interested in Rakul Preet Singh

  'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

  హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

  English summary
  Pawan is currently looking for female lead role in Gabbar Singh Sequel. He made up his mind to pair up with a fresh face. Now a buzz in industry is that Power Star is interested to give a chance to “RAKUL PREETH SINGH”. She recently admired in public that she is a big Fan of Pawan Kalyan. Adding to that recently Rakul Preeth Singh scored a hit with Venkatadri Express . Sampath Nandhi is the director for this flick, Under the Pawan Kalyan’s Creative Works Banner. If all goes according to the plan the movie will be on sets from January 25th of 2014.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more