»   »  ఫుల్ ఖుషీ: పవన్ యాక్షన్ లోకి దూకుతున్నాడు

ఫుల్ ఖుషీ: పవన్ యాక్షన్ లోకి దూకుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పొలిటికల్ ఫైర్ ని ఆహ్వానించి,అభినందించినా ఆయన ఎప్పుడు సినిమాలు చేస్తాడు అనే విషయం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తారనేది నిజం. బిజేపీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న పవన్ త్వరలోనే సెట్స్ కు వెళ్లి యాక్షన్ లోకి దూకబోతున్నారు. ఆ ఆనంద ఘడియలు జూన్ రెండో వారం నుంచి మొదలవుతాయి అంటున్నారు. మొదటగా ఆయన గబ్బర్ సింగ్ 2 షూటింగ్ సిద్దపడుతున్నట్లు సమాచారం. ఆ తర్వాతే ఓ మైగాడ్ రీమేక్ చేస్తారు.

రాజకీయాల విషయానికి వస్తే... తెదేపా, భాజపాల మధ్య ఎన్నికల అవగాహన పూర్తిస్థాయిలో కుదరటంతో ఈ కూటమికి మద్దతివ్వాలని.. ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొనాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించుకున్నారు. భాజపా ప్రధాని అభ్యర్థి మోడీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సభలకీ ఆయన హాజరుకానున్నారు. మరోవైపు తొలుత జనసేన, ఆ తరువాత భాజపా మద్దతుతో విజయవాడ నుంచి పోటీ చేయాలని భావించిన నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌.. శుక్రవారం పవన్‌తో భేటీ అనంతరం ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.

Pawan Kalyan Action from June

మరో ప్రక్క లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాశ్‌ నారాయణ్‌కు మద్దతు ప్రకటించిన జనసేన వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌... త్వరలో ఆ నియోజకవర్గంలో జేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈనెల 22న సికింద్రాబాద్‌లో మోడీ నేతృత్వంలో భాజపా సభకు హాజరుకానున్న పవన్‌.. ఆ తర్వాత జేపీకి మద్దతుగానూ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. 24-26 తేదీల మధ్య పవన్‌ ప్రచారం ఉండేలా లోక్‌సత్తా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రధానంగా యువతను ఆట్టుకోవడం లక్ష్యంగా బహిరంగ సభ.. ఎంపిక చేసిన యువకులతో ఇష్టాగోష్ఠి ఉండే విధంగా ప్రచార ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ వంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల పవన్‌తో రోడ్డు షోలు ఉండేలా చూస్తోంది. ఒకే రోజుకు పరిమితం కాకుండా.. వేర్వేరు రోజుల్లో ఈ ప్రచార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. పవన్‌ ప్రచారానికి సంబంధించిన ఈ ప్రతిపాదనలను లోక్‌సత్తా నేతలు జనసేన వర్గాల దృష్టికి తీసుకెళ్లారు. ప్రచార తేదీలను పవన్‌, జేపీలు ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది. ఇప్పటికే సినీ దర్శకుడు రాజమౌళి జేపీ తరఫున ప్రచారం చేశారు. తాజాగా పవన్‌ రంగంలోకి వస్తుండటంతో లోక్‌సత్తా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.

English summary

 Pawan Kalyan will commence the shoot of Gabbar Singh 2 first. Most probably the movie will go to the sets in the first week of June in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu