»   »  పవన్ కళ్యాణ్ కి ఆ టీవీ ఛానెల్ పై కోపం వచ్చిందా?

పవన్ కళ్యాణ్ కి ఆ టీవీ ఛానెల్ పై కోపం వచ్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"కొమురం పులి" ఫిలిం ఎగ్జిబిటర్ ఆత్మహత్య అనే అర్దం వచ్చేలా నిన్న(మంగళవారం) ఎబిఎన్ ఆంద్రజ్యోతి టీవీ ఛానెల్ న్యూస్ ప్రసారం చేసింది. అయితే నిజానికి కొమురం పులి ప్లాఫ్ అవటం వల్ల వచ్చని నష్టాలకు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఖలేజా విడుదల నిమిత్తం ఆ నిర్మాతకు ఇవ్వాల్సిన డబ్బు దొంగిలింప బడటంతో ఆ ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన అంతకుముందు కొమురం పులిని తమ ధియోటర్సో లో అడించారు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి...ఖలేజా సినిమా ప్రదర్శన కోసం వెంకటేశ్వరరావు రూ.12.50 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు.

రాము, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తుల నుంచి రూ.9.40 లక్షలు సేకరించారు. గుంటూరులోని డ్రిస్టిబ్యూటర్‌ కు చెల్లించేందుకు వస్తూ ఆదివారం రాత్రి సంగం థియేటర్ ‌లో ఆ మొత్తాన్ని ఉంచారు. నిమిషాల వ్యవధిలోనే ఆ డబ్బు చోరీకి గురైంది. దాంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇదీ పోలీసుల కధనం. ఇక మధ్యలోకి పవన్ కళ్యాణ్ పులి ప్రస్తావన తెచ్చి అది ప్లాపవటం వల్లనే ఈ ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో కథనం నడపటం పవన్ కళ్యాణ్ కి కోపం తెప్పించిందని తెలుస్తోంది. ఆయన ఆ వార్త తెలిసుకుని తనకు పరిచయం ఉన్న మీడియావారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే అనవరసంగా ఛానెల్ ని హైలెట్ చేసినట్లు అవుతుందని కొందరు సలహాలివ్వటంతో పవన్ కోపాన్ని దిగమింగుకున్నాడని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu