»   » అతని పేరు ఎత్తితేనే పవన్ కి మండుతోంది

అతని పేరు ఎత్తితేనే పవన్ కి మండుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో విలన్ పాత్రకు సోనూ సూద్ ని అడిగితే కాదన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు మరో యంగ్ విలన్ ని వెతుకుతున్నారు. దబాంగ్ లోనూ, తమిళ రీమేక్ లోనూ చేసిన సోనూ సూద్ తెలుగుకు ఎందుకు రిజెక్టు చేసాడో పవన్ కళ్యాణ్ కి అర్దం కాలేదు. తన సినిమాలో చేయననా లేక ఆ పాత్ర మరో సారి చేయటం ఇష్టం లేక అన్నది సోనూ సూద్ క్లారిఫై చేయలేదు. డేట్స్ ఖాళీలేవని చెప్పి రిజెక్టు చేసాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఇగో దెబ్బతిందని అంటున్నారు.

సోనూసూద్ కి ఎలాగయినా బుద్ది చెప్పాలని ఫిక్స్ అయ్యాడని, ముఖ్యంగా తమ మెగా క్యాప్ లోని హీరోలైన తాను, అల్లు అర్జున్, రామ్ చరణ్ అతన్ని ప్రక్కన పెడితే చాలని అన్నాడని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇప్పటికైనా సోనూ సూద్ వెళ్ళి పర్శనల్ గా పవన్ కలస్తే కొంతలో కొంత బెటర్ అని వారు అంటున్నారు. అయితే కందీరీగలో అతని ఫెరఫార్మెన్స్ చూసి ముచ్చటపడ్డ బెల్లంకొండ సురేష్ అతను హీరోగా సినిమా చేస్తానని ప్రకటించటమే సోనూసూద్ నెగిటివ్ క్యారెక్టర్స్ వద్దనుకోవటానికి కారణమని ఓ వర్గం అంటోంది. ఏదైమైనా పవన్ వంటి స్టార్ హీరోతో పెట్టుకుని సాధించేది ఏమి ఉండదని చెప్తున్నారు.

English summary
Sonu Sood rejected Telugu film Gabbar Singh opposite Pawan as villain, without showing proper reason.. Now Pawan is hurt with this and Pawan is thinking to teach a lesson to Sonu Sood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu