»   » ఆర్కిటెక్ పాత్రకు పవన్ కి రెండు కోట్లు?

ఆర్కిటెక్ పాత్రకు పవన్ కి రెండు కోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ త్వరలో ఆర్కిటెక్ గా కనిపించి అలరించనున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్న ఏసుక్రీస్తు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో పవన్ చేయబోయే పాత్ర ఆర్కిటెక్ ఇంజినీరు అని తెలుస్తోంది.మొదట ఈ పాత్ర ఓ దర్శకుడు అన్నట్లుగా ప్రచారమైంది. అయితే అది నిజం కాదని, ఆర్కిటిక్ గా పవన్ చేస్తున్నాడని, అందునిమిత్తం అతనికి రెండు కోట్ల రూపాయలు చెల్లించారని చెప్తున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ ఇజ్రాయెల్‌ లోని జెరూసలేంలో జరిగింది. ఇందులో పవన్‌ కళ్యాణ్ సరసన అనూష్క కనిపిస్తోంది. ఇ జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు గత రెండేళ్ల నుంచి ఈ చిత్ర కథను తయారుచేసారు. ఇక ఈ చిత్రంలో బాలలు ప్రధాన పాత్ర పోషిస్తారు. బాల రామాయణం, బాల భారతం తరహాలో ఇది బాలలతో రూపొందింస్తున్న క్త్రీస్తు చరిత్ర.

English summary
Pawan Kalyan is doing a key role (Architect) in a film directed by Singeetham Srinivas Rao and the film is based on life Jesus Christ.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu