»   »  పవన్ కళ్యాణ్ అతనికి ఫోన్ చేసాడట, నిజమా?

పవన్ కళ్యాణ్ అతనికి ఫోన్ చేసాడట, నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం వల్ల బాగా కలిసొచ్చింది ఎవరికి? అంటే హీరో కళ్యాణ్ రామ్ పేరు కాకుండా, దర్శకుడు అనిల్ రావిపూడి పేరు చెబుతున్నారంతా.

హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి హీరో మరియు నిర్మాత. ఆయకు వస్తే గిస్తే లాభాలు వస్తాయి. కానీ దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి లైఫ్ వచ్చింది అంటున్నారు. సాధారణంగా సినిమా పరిశ్రమ అంటేనే హిట్ల చుట్టూ తిరుగుతుంది. ఒక హీరోగానీ, దర్శకుడుగానీ హిట్టు కొడితే వారికి అవకాశాలు వరుస పెడతాయి.

Pawan kalyan calls Anil Ravipudi

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ‘పటాస్' విషయంలోనూ అదే జరిగింది. అనిల్ రావిపూడికి పలువురు నిర్మాతలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. నెక్ట్స్ సినిమా తమతో అంటే తమతో చేయాలని కోరుతున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ నుండి అతనికి ఆఫర్ వచ్చిందని ఆ మధ్య ప్రచారం జరిగింది.

తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అనిల్ రావిపూడికి ఫోన్ చేసాడని, తన కోసం మంచి కథ ప్రిపేర్ చేయాలని అడిగాడంటూ ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, మొత్తానికి ‘పటాస్' విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయింది మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పక తప్పదు. మరి తొలి విజయం ద్వారా ఆయనకు వచ్చిన స్టార్ స్టేటస్‌ను భవిష్యత్తులో ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

English summary
Anil Ravipudi after his debut flick Pataas with Kalyan Ram became overnight star. According to the latest many star heroes are showing interest in acting under his direction. Recently rumours came that Allu Arjun asked him to prepare story for him. Now buzz is Power Star Pawan Kalyan called him too asking him to prepare story for him.
Please Wait while comments are loading...