»   » చిరు అంత లోకువయ్యాడా?? అన్నయ్య కోసం కనీసం ఇన్విటేషన్ కూడా వెళ్ళలేదా..??

చిరు అంత లోకువయ్యాడా?? అన్నయ్య కోసం కనీసం ఇన్విటేషన్ కూడా వెళ్ళలేదా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఇప్పటికీ ఓపెన్ సీక్రెట్ గా ఉన్న విషయం మెగా బ్రదర్స్ మధ్య ఉండే విభేదాలే కొద్ది రోజులుగా మామధ్య ఏ గొడవలూ లేవూ అని చెప్పిన మెగా బ్రదర్స్ గత కొంత కాలంగా ఆ మాటకూడా చెప్పటం లేదు. ప్రతీ మెగా ఫంక్షన్ కీ పవన్ వస్తాడు అని చెప్పేవాళ్ళు తర్వాత పవర్స్టార్ రాక పోవటం ఎవరో ఒక రు ఆ విషయాన్ని కవర్ చేయటం మామూలు అయిపోయింది.

దూరంగానే ఉన్నాడు

దూరంగానే ఉన్నాడు

దృవ, ఖైదీ నెం 150 సినిమాల ఫంక్షన్లకి కూడా పవన్ వస్తున్నాడు అని కొన్ని వార్తలు వినిపించినా "రాడు" అని 90% మంది ఫిక్సైపోయారు. అనుకున్నట్టే పవర్స్టార్ ఆ ఫంక్షన్లకి దూరంగానే ఉన్నాడు. మెగా టీం కూడా ఈ సారి ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించకపోగా రాకపోవటం మంచిదే అన్నట్టు ప్రవర్తించారు. మెగా ఫ్యామిలీకీ పవన్ కళ్యాణ్ కీ మధ్య దూరం పెరిగిందనేది ఇప్పుడు అందరికీ తెలిసినా పైకి మాత్రం అనటం లేదు.

చిరు వస్తాడా?

చిరు వస్తాడా?

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మెగా విభేదాల విషయం తెరమీదకి రానుంది. తాజాగా "కాటమరాయుడు" గా పవన్ వస్తున్న సమయం లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు వస్తాడా?? అన్న విషయం మీద కొన్ని చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ విషయం కూడా స్పష్టమైనట్టే కనిపిస్తోంది. చిరు కాటమరాయుడు వేదిక మీదకు రావటం లేదు... అసలు చిరు కోసం ఇన్విటేషనే వెళ్ళలేదంటూ సమాచారం.

కాటమరాయుడు బృందం మాత్రమే

కాటమరాయుడు బృందం మాత్రమే

ఈ ఈవెంట్ లో కేవలం కాటమరాయుడు బృందం మాత్రమే పాల్గొంటుందట. పవన్‌ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని కాటమరాయుడు ఫంక్షన్‌లో చిన్న సెలబ్రేషన్‌ వుంటుందట. ఇందుకోసమైనా చిరంజీవిని పిలుస్తారని ఫాన్స్‌ భావించారు. కానీ ఈసారి అన్నయ్యని పిలవడానికి పవన్‌ ఎలాంటి అటెంప్ట్‌ చేసినట్టు లేడు. ఇరవయ్యేళ్ల వేడుకని ఆర్భాటంగా చేయవద్దని, సింపుల్‌గా చేసేయమని పవన్‌ చెప్పాడట.

రామ్ చరణ్ , అల్లు అర్జున్

రామ్ చరణ్ , అల్లు అర్జున్

ఈ నెల 18 న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిధిగా ప్రస్తుతానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రావడం మాత్రం కన్ఫర్మ్ అయ్యిందనీ, మరో వైపు అల్లు అర్జున్ కూడా రావొచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం లో కూడా పక్కా క్లారిటీ అయితే లేదు .

తామంతా ఒకటే

తామంతా ఒకటే

ఫాన్స్ మధ్య విభేదాలు ముదిరి శృతి మించి రోడ్డుకెక్కడంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మెగా కాంపౌండ్ భావిస్తోంది అనీ ఈ సారి ఎక్కడ అవకాశం వచ్చినా తామంతా ఒకటే అన్న సంకేతాలని ఫ్యాన్స్ లోకి చేరవేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టలన్న నిర్ణయం తీసుకున్నారు అని చెప్పుకుంటున్నారు.

ఆడంబరంగా జరగబోవడం లేదు

ఆడంబరంగా జరగబోవడం లేదు


ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా భారీ ప్రాంగణంలో కాకుండా శిల్పకళావేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు. కనుక వేల కొద్దీ అభిమానుల మధ్య ఆడంబరంగా ఈ ఈవెంట్‌ జరగబోవడం లేదు. ఖైదీ నంబర్‌ 150కి ముందు గుంటూరులో చేసిన వేడుక ఆ చిత్రానికి హైప్‌ తీసుకొచ్చింది. మరి నామ్ కే వాస్తే ఈవెంట్‌ వల్ల కాటమరాయుడుకి కలిసొచ్చేది ఏమైనా వుంటుందా లేదా అనేది చూడాలి మరి.

English summary
Latest news in Tollywood That Pawan Kalyan did not send invitations to Chiru for katama rayudu pre release event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu