»   » నాలుగోసారి తండ్రి కాబోతున్న పవన్!.. డెలివరీ డేట్ ఇదిగో..

నాలుగోసారి తండ్రి కాబోతున్న పవన్!.. డెలివరీ డేట్ ఇదిగో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికే ముగ్గురికి జన్మనిచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నాడట. ప్రస్తుతం అన్నా లెజ్ నోవా తో జీవితాన్ని పంచుకుంటున్న పవన్.. ఆమెతో కలిసి కూతురిని కన్నాడు. తనకు పొలేనా అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు.. పొలేనాకు రక్త సంబంధంగా ఓ తోడును తీసుకురాబోతున్నాడని.. ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు.

14న డెలివరీ డేట్

14న డెలివరీ డేట్

అలా అనుకోవడమే కాదు.. లెజ్ నొవాకు.. వచ్చే నెల 14న డెలివరీ డేట్ ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు. ఇది విన్న పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. తమ హీరో.. మళ్లీ తండ్రి కానుండడంతో.. బెస్ట్ విషెస్ చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే పవన్.. రేణూ దేశాయ్ తో కలిసి.. ఇద్దరు పిల్లల్ని కన్నాడు.

నాలుగోసారి తండ్రిగా

నాలుగోసారి తండ్రిగా

అన్నా లెజ్ నోవాతో జీవితాన్ని మొదలు పెట్టకముందు.. రేణూ దేశాయ్ తో సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. అకీరా నందన్ తో పాటు.. ఆద్య అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. తర్వాత.. లెజ్ నోవాతో కలిసి ఇప్పుడు రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నాడు. ఇలా.. మొత్తంగా... నాలుగోసారి తండ్రిగా మారబోతూ.. కొత్త బాధ్యతను పవన్. మోయనున్నాడు...

రేణూ దేశాయ్ పిల్లలకు..

రేణూ దేశాయ్ పిల్లలకు..

ఇక్కడ.. పవన్ కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. లెజ్ నోవాతో కలిసి.. ఉంటున్నా. రేణూ దేశాయ్ పిల్లలకు.. పవన్ వీలైనంతగా సమయం కేటాయిస్తాడు. పిల్లలిద్దరూ రేణూతోనే ఉంటున్నా.. తను కూడా అప్పుడప్పుడూ పుణె వెళ్లి మరీ.. వారికి ఆనందాన్ని పంచి వెళ్తుంతాడు.

లెజ్ నోవా పిల్లల విషయంలోనూ

లెజ్ నోవా పిల్లల విషయంలోనూ

అలా బాధ్యత కలిగిన తండ్రిగా అకీరా, ఆద్య విషయంలో ప్రవర్తిస్తున్న పవన్.. ఇప్పుడు లెజ్ నోవా పిల్లల విషయంలోనూ అదే బాధ్యత చూపిస్తున్నాడు. కుటుంబానికి సమయం కేటాయించడంలో పవన్ ముందుండటం గమనార్హం.

English summary
Grapevine is abuzz that Power Star Pawan Kalyan is expecting his fourth child with his wife Anna Lezhneva. Anna is Pawan’s third wife and the celebrity couple already has a daughter named Polena. Although there is no official confirmation from the couple, several media reports have suggested that Anna is pregnant quoting sources close to the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu