For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ రెమ్యూనేషన్ అంత పెంచారా?

  By Srikanya
  |

  హైదరాబాద్ :గబ్బర్ సింగ్ హిట్ తో జోరు మీదున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన రెమ్యునేషన్ పెంచాడని వినిపిస్తోంది. అయితే ఆయన్ని బుక్ చేయాలనుకున్న నిర్మాతలు ఆ రెమ్యునేషన్ సబబే అంటున్నట్లు సమాచారం.
  ఇంతకీ ఆయన ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునేషన్ ఎంతంటే...15 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆ రెమ్యునేషన్ ని..కెమెరా మెన్ గంగతో రాంబాబుతో సినిమాకు ఒప్పుకున్న సినిమాలుకు అంటున్నారు.
  అయితే పవన్ మీద మీద పెట్టుబడి ఎప్పుడూ లాస్ కాబట్టి..సినిమా ప్లాప్ అయినా మినిమం రెవిన్యూ వస్తుంది కాబట్టి ఆ రేటుని ఎవరూ అభ్యంతరం చెప్పుటం లేదు.

  ఇక ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయంటున్నారు. నైట్ ఎఫెక్ట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి. ఈ ఫైట్ మరికొన్ని రోజులు షూట్ జరుగుతుంది. తర్వాత ఓ పాటను తెరకెక్కిస్తారు.

  అలాగే ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది.

  పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొన్న ఓ రోజు అనుకున్నారు కానీ వర్షం రావటం తో కుదరలేదు. ఇక పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.

  'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

  English summary
  A close source to Pawan Kalyan revealed that the actor is now demanding a whopping 15 crores as remuneration. Rather saying demand, we can say that many producers are luring him with that price as working with him itself is a big-deal for them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X