Remuneration: పవన్ కల్యాణ్ OG రెమ్యూనరేషన్.. పవర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం OG చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా విశేషమైన స్పందనను అందుకుంటుంది. పవర్ స్టార్ నుంచి చివరిగా వచ్చిన హరహర వీరభల్లు చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మంచి ఆకలి మీద ఉన్న పవర్ స్టార్ అభిమానులకు OG చిత్రం ఫుల్ మీల్స్ ని అందించింది. ఎప్పటినుంచో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సెప్టెంబర్ 25 పెద్ద పండుగనే తెచ్చింది. ప్రస్తుతం థియేటర్లో ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా లేదు. ఇదే స్థాయిలో OG చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.
ఇక OG చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒజాస్ గంభీర పాత్రలో సరికొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్ తో పాటు, పవర్ ఫుల్ డైలాగ్స్, కళ్ళు చెదిరే యాక్షన్ సీన్లలో పవర్ స్టార్ రెచ్చిపోయారు. దాంతో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను ఎప్పటినుంచో ఇలానే చూడాలనుకుంటున్నామని తమ అభిప్రాయం కూడా వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. మరోవైపు బీజీఎం, సౌండ్ ట్రాక్, సాంగ్స్ తో మోత మోగించారు. ఇలా అన్నీ కలిపి OG సౌండ్ వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ OG చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు నిర్మాతల పక్షాన ఉండే పవన్ కళ్యాణ్, తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆచితూచి అడుగేస్తారు. గత చిత్రం హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. అడ్వాన్స్ గా తీసుకున్న 11 కోట్ల రూపాయలను కూడా తిరిగి ఇచ్చేశారు. ఈ క్రమంలో OG చిత్రానికి ఎంత పారితోషకం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే అత్యధిక పారితోషాన్ని OG చిత్రంతో అందుకున్నారని తెలుస్తోంది. ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను అందుకున్నారని సినీ ప్రముఖులు తెలుపుతున్నారు. ఇక ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అందుకోవడం తొలిసారి అని కూడా అంటున్నారు. ఎప్పుడూ నిర్మాత బాగుండాలని చూసే ఆయన పారితోషికానికి పెద్దగా ప్రాథమిక ఇవ్వలేదని చెబుతున్నారు.
ఇక OG చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో థియేట్రికల్ గా రన్ కొనసాగుతుందని శని ప్రముఖులు తెలుపుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ ఏడాది సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ స్కేల్లో నిర్మించారు.


Click it and Unblock the Notifications











