twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ డైరక్టర్ కి పవన్ గ్రీన్ సిగ్నల్!!?

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ తో రచ్చ చిత్రం రూపొందించిన సంపత్ నందికి మెగా క్యాంప్ మరో అవకాసం ఇవ్వనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కి తాజాగా ఓ స్క్రిప్టుని నేరేట్ చేసిన సంపత్ నంది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రచ్చ లాగానే పక్కా కమర్షియల్ స్టోరీ ఐడియాతో పవన్ ని సంప్రదించాడని,గబ్బర్ సింగ్ తరహా హిట్ అవుతుందని నమ్మి స్కిప్టు ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. రచ్చ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యిందని,రామ్ చరణ్ తోనే మరో సినిమా అని రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ పవన్ తో అతని కెరిర్ మరో మలుపు తిరగనుందని తెలుస్తోంది.

    ఇక పదిరోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ స్టార్టైందని సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు. అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి. పవన్ సైతం యువ దర్శకులను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలోనే హరీష్ శంకర్ ని,సంపత్ నంది తో ఓకే చేసాడని,పవన్ ఫ్యాన్స్ కు పండగ అయ్యేలా డైలాగులు,సీన్లతో మరో వెర్షన్ రాసుకొస్తానని సంపత్...పవన్ కి మాట ఇచ్చాడని అంటున్నారు.

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం చేస్తున్నారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయంటున్నారు. నైట్ ఎఫెక్ట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వస్తాయి. ఈ ఫైట్ మరికొన్ని రోజులు షూట్ జరుగుతుంది. తర్వాత ఓ పాటను తెరకెక్కిస్తారు.

    'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Pawan Kalyan has given nod for an exciting script narrated by the young director Sampath Nandi became a big name in Tollywood after directing Ram Charan's 'Rachcha'. Pawan Kalyan, who impressed with script narrated by this young director and has given nod for the film immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X