»   » ఇంట్రెస్టింగ్‌: పవన్ కళ్యాణ్ పెళ్లి ఘట్టం హాట్ టాపిక్!

ఇంట్రెస్టింగ్‌: పవన్ కళ్యాణ్ పెళ్లి ఘట్టం హాట్ టాపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా మొత్తం మీద కొన్ని అంశాలు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి 100 గుర్రాలు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసే సీన్.

చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?


తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. సినిమాలో పవన్ కళ్యాణ్, కాజల్ మధ్య పెళ్లి సన్నివేశం ఉంటుందని.... ఈ పెళ్లి ఘట్టం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతు సినిమాలకు హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. గతంలో ‘గబ్బర్ సింగ్' చిత్రంలో కూడా పవన్-శృతి హాసన్ పెళ్లి సీన్ హైలెట్ అయిన సంగతి తెలిసిందే.


పీక్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్... వెడ్డింగ్ కార్డుపై కూడా!


Pawan Kalyan Marries Kajal Agarwal in Sardaar

100 గుర్రాల సీన్...
‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో 100 గుర్రాలతో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మాతలు. ‘సర్దార్‌' కోసం చిత్రబృందం ఇప్పుడో భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కించనుంది. ఇందుకోసం వంద గుర్రాలు, బోలెడన్ని ఖరీదైన కార్లు వాడుతున్నారట.


‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
An interesting scene of the 'Sardaar Gabbar Singh' movie was shot that has Power Star Pawan Kalyan tying knot to gorgeous diva Kajal Aggarwal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu