twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లోగో లాంచ్ కి పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సినిమా పంక్షన్ కి వస్తే ఆ క్రేజే వేరు. అందుకే దర్శక,నిర్మాతలు ఆయన్ను రప్పించటానికి నానా తిప్పలూ పడుతూంటారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ పొలిటికల్ బిజీలో తిరుగుతూ సిని పంక్షన్స్ హాజరుకావటం లేదు. ఇప్పుడు మళ్లీ ఓ ఆడియో లోగా లాంచ్ పంక్షన్ కి హాజరవుతారని తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు గాలిపటం. ఈ సినిమాకి పవన్ కీ రిలేషన్ ఏమిటీ అంటే సంపత్ నంది. తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 డైరక్టర్ అతను. తన వల్లే ప్రాజెక్టు లేటయ్యి,సంపత్ నందికి ఇబ్బంది కలుగుతోందని గమనించిన పవన్ తనవంతు సాయిం ఇలా చేయటానికి ముందుకు వచ్చాడని చెప్పుకుంటున్నారు.

    పవన్ తో షూటింగ్ ఇంకా లేటయ్యేటట్లు ఉంది. గ్యాప్ లో ఇంకో సినిమా చేద్దామంటే కుదరదు. అందుకే నిర్మాతగా అవతారం ఎత్తాడంటున్నారు సంపత్ నందిని. 'ఏమైంది ఈవేళ'తో దర్శకునిగా పరిచయమై రామ్‌చరణ్‌ 'రచ్చ'తో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సంపత్‌ నంది. ఆ వెంటనే 'గబ్బర్‌సింగ్‌2' అవకాశం అందుకొని లక్కీ దర్శకుడు అని కూడా అనిపించుకున్నారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్టు ఓపినింగ్ అయ్యి కూడా లేటవుతోంది. ఈ నేపధ్యంలో ఈ సంపత్ నంది నిర్మాతగా ఓ చిత్రం పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోకి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

    సంపత్ నంది ఇప్పుడు 'గాలి పటం' సినిమాతో నిర్మాతగా మారారు. అతని స్నేహితులు కిరణ్‌, విజయ్‌లతో కలసి ఎల్‌.ఎ.టాకీస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన్‌ గాంధీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆది, రాహుల్‌, ఎరికా ఫెర్నాండేజ్‌, క్రిస్టినా అకీవా ప్రధాన పాత్రధారులు.

    pawan kalyan might attend 'Galipatam' logo launch.

    సంపత్‌ నంది మాట్లాడుతూ ''ఏమైంది ఈ వేళ' తరహాలోనే యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. దర్శకుడు నవీన్‌ గాంధీని సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. రొటీన్‌కు భిన్నంగా నవ్యమైన ప్రేమకథతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలో సినిమా టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తాము'' అన్నారు

    ఈ సినిమా మా సంస్థకు శుభారంభాన్నిస్తుందన్న విశ్వాసముంది అన్నారు. ప్రీతిరాణా, పోసాని కష్ణమురళి, సప్తగిరి, వేణు, చంద్ర, దువ్వాసి మోహన్, శ్రీమన్నారాయణ, రామారావు, ప్రగతి, హేమ, శకుంతల, గీతాంజలి, రేఖ, రత్నాసాగర్, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పువరపు, విజయకుమార్ వట్టికూటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.యస్.కుమార్.

    ఇక సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్-2' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    
 Sampath Nandi produced a film titled as Galipatam and Aadi, Rahul, Erika Fernandez and Christina Akiva play the lead characters in this movie and Naveen Gandhi is the debutant director. The shooting of the film is going on at a brisk pace now and the title logo will be launched very soon. The buzz is that pawan kalyan might attend this logo launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X