For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ఫ్యాన్స్ కు పండుగ: పవన్ నెక్స్ట్ మే లోనే ప్రారంభం

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేయటానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్న పవన్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రచ్చ దర్సకడుతో ఆయన చేయబోయే చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది. రీసెంట్ గా స్క్రిప్టుని ఫైనల్ చేసి లాక్ చేసిన పవన్... ప్రీ ప్రొడక్షన్ చేసుకోమని అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు శరద్ మరార్ నిర్మించనున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. NTV ఛానెల్ సి.ఈ.ఓ గా చేస్తున్న శరత్ మరార్ నిర్మతగా కొత్త చిత్రం తెరకెక్కనుందని సమాచారం. చాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది. . దీంతో ఓ మంచి కథ వెతికే ప్రయత్నంలో శరత్ ఉన్నాడు. మే 2013 లో ఈ చిత్రం మొదలుకానుందని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. శరద్ మరార్ గతంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసారు. ఆయన కెరీర్ ..అమితాబ్ కు చెందిన ఎబిసిఎల్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ గా మొదలెట్టారు.

  మరో ప్రక్క శరత్ మరార్... చిత్ర సీమ అనే కొత్త ఛానెల్ ని NTV ఆధ్వర్యంలో మొదలు పెట్టానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యులైన కొందరు నిర్మాతలు ఈ ఛానెల్ లో భాగస్వాములుగా ఉండి మరీ ఈ ఛానెల్ ని తెస్తున్నారని తెలుస్తోంది. శరద్ మరార్ గతంలో మాటీవిలోనూ మంచి రేటింగ్స్ తెచ్చారని, ఇప్పుడు ఈ కొత్త తెలుగు సినీ ఛానెల్ ను కూడా ఆయన నిలబడతారని భావిస్తున్నారు. ఇక శరద్ మరార్ కి మొదటి నుంచీ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి. పవన్ స్నేహితుడుగానే కాకుండా ఆయన పరిశ్రమ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.

  గతంలో పవర్ స్టార్ చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన రమణ గోగుల సంగీతం అందించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ 50% వాటా కలిగి ఉన్నాడట. సంపత్ నంది చెప్పిన స్టోరీలైన్ పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చిందని, వెంటనే ఓకే చేసాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. హీరోయిన్... ఇతర సాంకేతిక వర్గం వివరాలు ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

  English summary
  Director Sampath Nandi has finally got a heads up by Pawan Kalyan for his next project. The film had lost its track as the actor was busy shooting for other films but the latest we hear is that the film will start rolling out in the last week of April or early May. Those in the know say that Sampath is almost done making final changes to the script and is likely to start pre production shortly. The film will be produced by successful TV honcho and Pawan Kalyan's aide Sharath Marar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X